Vastu Tips For Bed Room: దంపతుల మధ్య విభేదాలా.. ఆర్ధిక ఇబ్బందులా.. బెడ్ రూమ్ ఈ దిశలో ఉందో లేదో చెక్ చేసుకోండి..

|

Aug 17, 2023 | 12:32 PM

ఎంత విలాసవంతమైన ఇల్లు ఉన్నా భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడతారు. నిత్యం  మనస్పర్థలతో ఇంటి వాతావరణం ఇబ్బందికరంగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటే భార్యాభర్తలు  తమ మధ్య పరస్పర సమన్వయాన్ని పెంచుకోవడంతో పాటు..  మీ పడకగది వాస్తుపై కూడా శ్రద్ధ వహించండి. భార్యాభర్తల మధ్య విబేధాలు ఉండకూడదు.. వారి జీవితంలో ఆనందం ఉండాలంటే.. దంపతుల పడకగది సరైన స్థలంలో ఉండాలి.

Vastu Tips For Bed Room: దంపతుల మధ్య విభేదాలా.. ఆర్ధిక ఇబ్బందులా.. బెడ్ రూమ్ ఈ దిశలో ఉందో లేదో చెక్ చేసుకోండి..
Vastu Remedies For Bed Room
Follow us on

ఇంట్లో బెడ్ రూమ్ కు ప్రత్యేక స్థానం ఉంది. రోజులో ఏర్పడిన అలసటను పోగొట్టి కొత్త శక్తిని పొందే ప్రదేశం పడకగది. వాస్తు ప్రకారం ప్రేమ, శాంతితో వైవాహిక జీవితాన్ని గడపడానికి భార్యాభర్తల బెడ్ రూమ్ చాలా ముఖ్యమైనది. చాలా మంది దంపతులు చిన్న ఇంట్లో కూడా ఎంతో ప్రేమగా జీవిస్తారు. అదే సమయంలో ఎంత విలాసవంతమైన ఇల్లు ఉన్నా భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడతారు. నిత్యం  మనస్పర్థలతో ఇంటి వాతావరణం ఇబ్బందికరంగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటే భార్యాభర్తలు  తమ మధ్య పరస్పర సమన్వయాన్ని పెంచుకోవడంతో పాటు..  మీ పడకగది వాస్తుపై కూడా శ్రద్ధ వహించండి. భార్యాభర్తల మధ్య విబేధాలు ఉండకూడదు.. వారి జీవితంలో ఆనందం ఉండాలంటే.. దంపతుల పడకగది సరైన స్థలంలో ఉండాలి. అంతేకాదు బెడ్ రూమ్ దిశ, గోడల రంగు, అద్దం, టాయిలెట్, ఫర్నిచర్ మొదలైనవి సరైన స్థలంలో ఉండాలి. ఇవి సరైన దిశలో లేకుంటే.. కలహాలు, ఒత్తిడి, ఆరోగ్య సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.

బెడ్ రూమ్ ఏర్పాటులో సరైన దిశ

  1. వాస్తు శాస్త్రంలో సంతోషకరమైన వివాహం కోసం కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి. దీని ప్రకారం సంబంధాలు, సహవాసం, సమర్థతతో కూడిన బంధం నెలకొనాలంటే.. నైరుతి దిశలో బెడ్‌రూమ్ ఉండాలి. ఇలా చేయడం వలన భార్యాభర్తలు తమ పనిలో సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. అంతేకాదు ఇద్దరూ కలిసి తమ కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటారు.
  2. దంపతులు వైవాహిక జీవితాన్ని గడపడానికి.. తమ పడకగదిని వాయువ్య ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా చేయడం వలన ప్రేమ, ఆకర్షణ కలుగుతుంది. ఈ దిశలో బెడ్ రూమ్ ఉండటం దంపతుల సంబంధాన్ని బలపరుస్తుంది.. అంతేకాదు జీవితం ప్రేమగా సాగుతుంది.
  3. వెస్ట్ జోన్ లాభాలకు చిహ్నం.. కనుక ఈ జోన్ లో నిర్మించిన బెడ్ రూమ్ దంపతులకు జీవితంలోని ప్రతి రంగంలో లాభాలు , సంపదను పొందేందుకు శుభప్రదంగా మారుతుంది.
  4. భార్యాభర్తలు ఈశాన్య దిశలో మంచాలను ఉంచడం మానుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఈశాన్య దిశకు అధిపతి బృహస్పతి.. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య సమన్వయ లోపం ఉంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. పడకగది అగ్ని అధినేత అయిన ఆగ్నేయ దిశలో ఉండటం వల్ల భార్యాభర్తల ప్రవర్తన అనవసరంగా దూకుడుగా మారడంతోపాటు చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం అలవాటుగా మారడం వల్ల ఇద్దరి మధ్య వైరం ఏర్పడుతుంది. ఇద్దరూ ఒకరి తప్పులు, లోపాలను ఎత్తి చూపడంలో నిమగ్నమై ఉంటారు. ఇది విడిపోవడానికి కూడా కారణం కావచ్చు. అంతేకాదు ఈ యాంగిల్‌లో బెడ్‌రూమ్ ఉండటం వల్ల అనవసరమైన ఖర్చులు కూడా పెరుగుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)