Tirupati: స్థానికులకు వైకుంఠ దర్శనం అవకాశం.. సర్వ దర్శనం టోకెన్లకు డిమాండ్.. బారులు తీరిన భక్తులు

|

Jan 10, 2022 | 7:47 AM

Tirumala: కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడ కొలువైన స్వామివారిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. అయితే కరోనా నేపథ్యంలో..

Tirupati: స్థానికులకు వైకుంఠ దర్శనం అవకాశం.. సర్వ దర్శనం టోకెన్లకు డిమాండ్.. బారులు తీరిన భక్తులు
Ttd Sarsvadarshanam Tickets
Follow us on

Tirupati: కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడ కొలువైన స్వామివారిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. అయితే కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే శ్రీవారిని దర్శించుకునే వీలుని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం స్థానికులకు సర్వదర్శనం టికెట్లను జారీ చేస్తోంది. ఈ మేరకు తిరుపతిలో ఐదు కేంద్రాలను టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల వద్ద భక్తులు బారులు తీరారు.

స్థానికులకు సర్వదర్శనం టోకెన్లను సోమవారం ఉదయం 9గంటలకు జారీ చేస్తామని టీటీడీ ముందే ప్రకటించింది. ఈ మేరకు తిరుపతిలో రామచంద్ర పుష్కరిణి, బైరాగపట్టడి, ఎమ్మార్‌పల్లి, మున్సిపల్‌ కార్యాలయం, సత్యనారాయణపురం ప్రభుత్వ పాఠశాలలో స్థానికులకు సర్వదర్శనం టోకెన్లను ఇచ్చేందుకు కేంద్రాలను ఏర్పాటు చేసింది. స్వామివారి దర్శించుకునేందుకు ఆదివారం రాత్రి నుంచే భారీ సంఖ్యలో టికెట్లను జారీ చేసే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. దీంతో టీటీడీ ఆదివారం రాత్రి 9గంటల నుంచే సర్వదర్శన టోకెన్లను ఇవ్వడం ప్రారంభించింది. అయితే టోకెన్లకోసం వచ్చిన భక్తుల్లో చాలా మంది కరోనా నిబంధనలు పాటించకపోవడంతో సర్వత్రా ఆందోళన రేకెత్తుతోంది. ఎటువంటి కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా భక్తులు భారీఎత్తున క్యూలైన్లలో వేచి ఉన్నారు.

దీంతో తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ టికెట్ కౌంటర్లను సందర్శించారు. అక్కడ భద్రచర్యలను పర్యవేక్షించి తగిన సూచనలు ఇచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు చెప్పారు. భక్తులు తప్పని సరిగా కరోనా నిబంధనలు పాటించాలని.. మాస్కులు ధరించాలని.. శానిటైజర్స్ తెచ్చుకోవాలని కోరారు.  రోజుకు 5వేల చొప్పున.. 10 రోజులకు 50వేల టోకెన్లను.. నెల 13 నుంచి 22 వరకు సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తున్నారు.  ఈ టోకెన్ల పంపిణీ కార్యక్రమం  మంగళవారం  ఉదయం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

Also Read:

ఈ రాశివారు ఈరోజ శుభవార్త వింటారు… నేడు ఏ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..