దివ్య అయోధ్య నగరిలో భవ్య దిపోత్సవ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో దీపోత్సవ వేడుకల సందర్భంగా సృష్టించిన 2 కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ల సర్టిఫికేట్‌లను అందుకున్నారు. రామలక్ష్మణులకు ప్రత్యేక పూజలు చేసి దిపోత్సవ్ వేడుకలను ప్రారంభించారు సీఎం యోగి. స్వయంగా దివ్వెలను వెలిగించి దిపోత్సవ్‌ను ప్రారంభించారు యోగి. అంతకుముందు అయోధ్య బాలరాముడిని దర్శించుకున్నారు.
అయోధ్యలో వెలుగుల పండుగ ప్రారంభమైంది. 55 ఘాట్‌ల వద్ద ఏకకాలంలో 25 లక్షలకుపైగా దీపాలను వెలిగించడం ద్వారా రామ్‌కీ పైడిని వెలిగించారు. దీంతో మరో గొప్ప రికార్డు నమోదైంది. 25 లక్షల 12 వేల 585 దీపాలను వెలిగించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో దీపోత్సవ్ తన పేరును నమోదు చేసుకుంది. సరయూకి ఇరువైపులా గుమిగూడిన వేలాది మంది భక్తులు తమ మొబైల్ కెమెరాల్లో ఈ అపూర్వ క్షణాన్ని బంధించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ దీపాల పండుగను కనులారా తిలకించారు. దీపాల పండుగ ప్రారంభానికి ముందు 1,100 మంది అర్చకులు సరయు హారతి నిర్వహించారు. ఈ సమయంలో సీఎం యోగి కూడా ఉన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం తరువాత ఇదే తొలి దీపోత్సవ్. అయోధ్య లోని 55 ఘాట్లలో దీపోత్సవ్ వేడుకలు జరుగుతున్నాయి. 30 వేల మంది వాలంటీర్లు దివ్వెలను వెలిగించారు.
500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రాంలాలా సన్నిధిలో అయోధ్య ప్రజలు దీపావళి జరుపుకోవడం ఇదే తొలిసారి. శ్రీరాముడు అవతరించిన తర్వాత తొలిసారిగా రాముడి పైడితో సహా 55 ఘాట్‌లను 25 లక్షలపైగా దీపాలతో వెలిగించారు. అంతే కాదు సరయూ నది ఒడ్డున 1100 మంది అర్చకులు మహా హారతి నిర్వహించారు. ఈ సమయంలో వేలాది మంది భక్తులు రామ్ కి పౌరి వద్దకు చేరుకుని దీపాల పండుగను ఆస్వాదించారు.
రాముని పాడి వధువులా అలంకరించారు. సరయూ ఘాట్‌లు దీపాలతో మెరిసిపోయాయి. సరయూ నది ఒడ్డున 25 లక్షల 12 వేల 585 దీపాలను ఒక్కొక్కటిగా వెలిగిస్తే ఆ దృశ్యం మంత్రముగ్ధులను చేసింది. ఈ అందమైన క్షణాన్ని ప్రజలు తమ మొబైల్ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రజలు ఇప్పటికీ రామ్ కీ పౌరిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్ షోను అందరిని తెగ ఆకట్టుకుంది.
As the sun sets, #Ayodhya lights up its own glow!#Deepotsav #Deepotsav2024 #AyodhyaDeepotsav #DeepotsavAyodhya #UPTourism #UttarPradesh #Ayodhya #ShriRam #Ram #Rama #ReligiousTourism @MukeshMeshram pic.twitter.com/2tnMkVpZbm
— UP Tourism (@uptourismgov) October 30, 2024
ఈరోజు అయోధ్యలో రెండు రికార్డులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదయ్యాయి. ముందుగా సరయూ నది ఒడ్డున 1 వేల 121 మంది కలిసి హారతి నిర్వహించారు. 25 లక్షల 12 వేల 585 దీపాలు వెలిగించి మరో సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ క్షణానికి స్వయంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు గవర్నర్ ఆనందీబెన్ పటేల్, కేంద్ర పర్యాటక-సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, యోగి ప్రభుత్వంలోని డిప్యూటీ సీఎంలు, మంత్రులు సాక్షులుగా నిలిచారు.
ఎనిమిదవ దీపోత్సవ వేడుకలో భాగంగా బుధవారం ఆలయ నగరం గుండా రామాయణ పాత్రల ప్రత్యక్ష పట్టికలతో ఊరేగింపు సాగినప్పుడు శ్రీరాముడి నగరమైన అయోధ్య పండుగ వాతావరణంలో మునిగిపోయింది. నూతనంగా నిర్మించిన రామమందిరంలో కుంకుమార్చన అనంతరం రామ్‌నగరిలో తొలిసారిగా దీపోత్సవం నిర్వహించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్వయంగా రాముడి రథాన్ని రామ్ దర్బార్ ప్రదేశానికి లాగారు. అనంతరం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా రాముడికి హారతి నిర్వహించారు.
#WATCH | Uttar Pradesh: Lakhs of diyas illuminated along the banks of the Saryu River in Ayodhya as part of the grand #Deepotsav celebration here.#Diwali2024 pic.twitter.com/7yd1QxDVZY
— ANI (@ANI) October 30, 2024
మరిన్ని ఆధ్యాత్మక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..