హిందూ మతంలో ఉత్థాన ఏకాదశి కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఏకాదశిని ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిధి రోజున జరుపుకుంటారు. ఈ రోజున విష్ణువు నాలుగు నెలల తర్వాత యోగ నిద్ర నుండి మేల్కొంటాడు. కనుక ఈ ఏకాదశిని ‘ప్రబోధిని ఏకాదశి’ అని కూడా అంటారు. ఈ రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజు పవిత్రమైన పని చేయడానికి అనుకూలమైన సమయంగా పరిగణించబడుతుంది. ఈ ఉపవాసం మతపరమైన దృక్కోణం నుంచి చూస్తే చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఉత్థాన ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు పరణ పద్ధతిలో ఉపవాసం విరమించాలి. లేదంటే ఏకాదశి ఉపవాసం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది.
హిందూ పంచాంగం ప్రకారం ఏకాదశి మర్నాడు అంటే ద్వాదశి తిథి రోజున సూర్యోదయం తర్వాత ఉత్థాన ఏకాదశి ఉపవాసాన్ని విరమించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. కార్తీక మాసం శుక్ల పక్షం ద్వాదశి తిధి నవంబర్ 13వ తేదీ ఉదయం 06:42 నుంచి 8:51 వరకు ఉపవాసం విరమణ చేయడానికి శుభ సమయం. రేపు అంటే బుధవారం ఏకాదశి ఉపవాసం విరమించి సాయంత్రం క్షీరాబ్ది ద్వాదశి పూజలను చేస్తారు. తులసి సాలిగ్రామ స్వామికి ఇంట్లో వివాహం చేస్తారు.
హిందూ మతంలో ఈ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున చేసే ఉపవాసంతో శ్రీమహావిష్ణువు ప్రసన్నుడవుతాడని నమ్మకం. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా వ్యక్తికి మతపరమైన, శారీరక , మానసిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి లభించి మోక్షాన్ని పొందుతాడని విశ్వాసం. అలాగే ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. కుటుంబంలో ఎల్లప్పుడూ ఆనందం ఉంటుంది.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.