
ఉగాది అంటే నక్షత్ర గమనం… యుగం ప్రారంభమైన రోజు.. యుగాది కాలక్రమంలో ఉగాదిగా మారింది. ఈ ఉగాదితోనే తెలుగు సంవత్సరం మొదలు అవుతుంది. ఒకొక్క తెలుగు సంవత్సరాన్ని ఒకొక్క పేరుతో పిలుస్తారు. ఆ సంవత్సరాన్ని అదే పేరుతో పిలుస్తారు. ఇప్పుడు క్రోధినామ సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం మార్చి 29న ముగుస్తుంది. అదే సమయంలో కొత్త సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మార్చి 30 నుంచి మొదలు కానుంది. ఈ ఉగాది పండగను తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు అందరూ సంప్రదాయంగా జరుపుకుంటారు. ఈ రోజు ఉగాది పండగ రోజున పూజ ఏ సమయంలో చేయాలి? ఉగాది రోజున ఏ పనులు చేయాలి? ఏ పనులు చేయకూడదు ఈ రోజు తెలుసుకుందాం..
చైత్ర శుద్ధ పాడ్యమి తిధి 2025 మార్చి 30వ తేదీ ఆదివారం రోజున ఉగాది పండగను జరుపుకోనున్నారు. ఈ రోజు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది.. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మొదలు కానుంది. ఈ రోజున ఉగాది పండగ సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి 7.30 గంటల వరకు పూజ చేసుకునేందుకు శుభ సమయం. అంతేకాదు ఉదయం 9 గం.నుంచి 11.30 గం. కొత్త బట్టలు ధరించి.. యజ్ఞోపవీత ధారణ చేయవచ్చు. అంతేకాదు ఈ సముయం ఉగాది పచ్చడి తినడానికి శుభ సమయం అని చెబుతున్నారు పండితులు.
ఉగాది రోజున ఏదైనా కొత్త వస్తువు కొనడం శుభప్రదం అని కొందరు భావిస్తారు. ఈ నేపధ్యంలో ఉగాది రోజున ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 3 గం. మధ్యలో పసుపు, బెల్లం, చింతపండు, బంగారం, వెండి మొదలైన శుభకరమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
ఉగాది పండగ అంటే ఒక సెంటిమెంట్.. ఈ రోజు ఎలా గడుస్తుందో.. అదే విధంగా ఏడాది మొత్తం ఉంటుందని ఓ నమ్మకం. కనుక ఉగాది రోజున కొన్ని పనులు చేయకూడదు. లేదంటే దురదృష్టం వెంటాడుతుందని పండితులు చెబుతున్నారు..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు