Ugadi 2022: హిందువులకు ఉగాది ముఖ్యమైన పర్వదినం. ఉగాదితోనే హిందువుల పండగలు(Hindu Festivals) ప్రారంభమవుతాయి. తెలుగు కొత్త సంవత్సరం (Telugu New Year) ప్రారంభం రోజు కావడంతో ప్రజలు కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇంటిని మామిడి ఆకులతో ముగ్గులతో అలంకరించుకుంటారు. తెలుగు ప్రజలు ఉగాది రోజున ఉగాది పచ్చడిని తప్పని సరిగా చేసుకుంటారు. పచ్చడి తయారీలో ఉపయోగించే అన్ని పదార్థాలు లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయి. పచ్చడి .. తీపి , పులుపుల కలయిక. ఈ ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. పచ్చి మామిడి, కొత్త చింతపండు, బెల్లం, వేప పువ్వుల వంటి తీపి పదార్థాలతో తయారు చేస్తారు.
ఉగాది పచ్చడి జీవితంలోని 6 వైవిధ్యమైన అభిరుచులతో పాటు భావోద్వేగాలను సూచిస్తుంది.
బెల్లం , అరటిపండు: (తీపి) ఆనందం
వేప పువ్వు: (చేదు) దుఃఖం, బాధ
పచ్చి మిరపకాయలు ( కారం): వేడి,కోపం
ఉప్పు (ఉప్పు): ఉత్సాహం, జీవిత సారం
చింతపండు (పులుపు): నేర్పుగా ఉండాల్సిన పరిస్థితులు.
వగరు (మామిడి): కొత్త సవాళ్లు.
ఈ పచ్చడి చేయడానికి కావలసిన పదార్థాలు:
వేప పువ్వు
బెల్లం పొడి
చెరకు
పచ్చి కొబ్బరి ముక్కలు
చింతపండు
ఎర్ర మిరప పొడి
మామిడి కాయ గుజ్జు
అరటిపండు
ఉప్పు
తయారీ విధానం: ముందుగా వేపపూతను శుభ్రం చేసుకుని నీటితో కడగాలి. బెల్లాన్ని తురుముకోవాలి. కొబ్బరి,మామిడికాయను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. అనంతరం చింతపండును నానబెట్టి రసం తీసి వడకట్టుకోవాలి. అనంతరం చింతపండు రసంలో బెల్లం వేసి.. కరిగే వరకూ కలపాలి. అనంతరం ఉప్పు, కొబ్బరి ముక్కలు, మామిడికాయలో ముక్కలు, చెరకు ముక్కలు,వేసి కలపాలి. తర్వాత వేపపువ్వు, అరటిపండు ముక్కలు వేసుకుని కలిపితే చాలు.. ఉగాది స్పెషల్ షడ్రుచుల సమ్మేళనం వేపపువ్వు పచ్చడి రెడీ.. జీవితం అంటే ఆరు రుచుల కలయిక అని, వీటిని స్వీకరిస్తేనే జీవితానికి ఓ అర్థం ఉంటుందని పండగ పచ్చడి చాటుతుంది.
Also Read: Heart Touching Story: ఏళ్ల తరబడి యజమాని కోసం ఎదురుచూస్తున్న కుక్క..!