Saleshwaram Lingamayya Swamy Temple: తెలంగాణ నాగర్‌కర్నూలు జిల్లాలోని సలేశ్వరం లింగమయ్య స్వామి భక్తులకు భారీ ఊరట లభించింది. వాహనాలకు భారీగా వసూలు చేస్తున్న టోల్ ఫీజులపై టీవీ9 వరుస కథనాలకు అటవీశాఖ (Forest Department) అధికారులు దిగొచ్చారు. టోల్ ఫీజులను సగానికి సగం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కారు, లారీ, డీసీఎంలకు వెయ్యి రూపాయలుగా ఉన్న టోల్ ఫీజును సగానికి తగ్గించి 500కు పరిమితం చేశారు. అటు ద్విచక్రవాహనాలకు వంద రూపాయల నుంచి 50 రూపాయలకు కుదించారు. ఈనెల 15న ప్రారంభమైన సలేశ్వరం ఉత్సవాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. సలేశ్వరానికి భక్తుల రద్దీ పెరుగుతుండటంతో వాహనాల రాకపోకలు ఎక్కువైపోయాయి. దీంతో ట్రాఫిక్ జాం సమస్య తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు టోల్ ఫీజును భారీగా పెంచేశారు. టోల్ ఫీజును భారీగా పెంచడంతో భక్తుల ఇక్కట్లపై టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది.
భక్తుల నుంచి భారీ వసూళ్లకు దిగిన అటవీశాఖ అధికారులు టీవీ9 కథనాలకు దిగొచ్చి.. టోల్ బాదుడును సగానికి తగ్గించారు. టోల్ ఫీజులు భారీగా తగ్గించేందుకు కృషి చేసిన టీవీ9ను భక్తులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. మరోవైపు నల్లమలలో వర్షాలు దంచికొడుతుండడంతో దారంతా బురదమయం అయింది. దీంతో అధికారులు సలేశ్వరం రావొద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. అయినా భక్తులు సలేశ్వరానికి తరలిపోతూనే ఉన్నారు.
Also Read: