సనాతన సంప్రదాయంలో రామ భక్తుడైన హనుమంతుడిని ఆరాధించడం వలన అన్ని కోరికలు నెరవేరుతాయని భావిస్తారు. బజరంగబలి ఆశీస్సులు ఎవరికి దక్కుతాయో అతని జీవితంలో పొరపాటున కూడా ఎటువంటి దుఃఖం లేదా ఇబ్బంది రాదని విశ్వాసం. హనుమంతుడి అనుగ్రహం వల్ల జీవితానికి సంబంధించిన సకల సౌభాగ్యాలు, సుఖ సంతోషాలు లభిస్తాయి. అష్టసిద్ధి ప్రదాత అయిన శ్రీ హనుమంతుని ఆరాధనకు మంగళవారం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. జీవితంలో ఐశ్వర్యాన్ని పొందాలంటే.. హనుమంతుని పూజకు కొన్ని నియమాలు తెలిపారు. మంగళవారం హనుమంతుడిని ఈ నాలుగు రకాలుగా పూజిస్తే శుభఫలితాలను ఇస్తుందని విశ్వాసం. అవి ఏమిటో తెలుసుకుందాం..
తమలపాకుతో పూజ:
హిందూ మతంలో తమలపాకు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అన్ని దేవతల పూజలో తమలపాకును ను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఎవరైనా మంగళవారం రోజున హనుమంతుడికి తమలపాకును సమర్పిస్తే చేపట్టిన పని తప్పని సరిగా పూర్తి అవుతుంది. హనుమంతుడి దయతో ఆ పని త్వరగా పూర్తవుతుందని నమ్ముతారు. హనుమంతుడి శుభ ఫలితాలను ఇవ్వాలంటే మంగళవారం తమలపాకుతో పూజ చేయండి.. తమలపాకు దండను సమర్పించండి.
సింధూరం సమర్పణ:
హనుమంతుని ఆరాధనలో సిందూరం సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఆయనకు సింధూరం అంటే చాలా ఇష్టం. కనుక మంగళవారం పూజ సమయంలో సింధూరం సమర్పించండి. అలాంటి భక్తుడికి కావాల్సిన వరాన్ని భజరంగబలి ఇస్తాడని విశ్వాసం. అంతేకాదు నూనె, వెండి లేదా బంగారు కూడా ఆంజనేయుడికి సమర్పించండి. ఇలాంటి పరిహారాన్ని చేయడం వల్ల జీవితంలోని అరిష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం.
శ్రీ రామ జెండాను సమర్పించండి
హిందూ మతంలో జెండాను పవిత్ర చిహ్నంగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో మంగళవారం మీ విశ్వాసం, సామర్థ్యం ప్రకారం బజరంగికి జెండాను సమర్పించండి. మంగళవారం హనుమంతునికి శ్రీ రాముడు అని ఉన్న జెండాను సమర్పించడం వలన ఎంత కష్టమైన పని అయినా త్వరగా పూర్తి చేస్తారని విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).