Tuesday Puja Tips: మంగళవారం సింధూరం, శనగలు హనుమంతుడి సమర్పించడం అత్యంత ఫలవంతం.. ఎందుకో తెలుసా..

|

Nov 07, 2023 | 8:19 AM

మంగళవారం ఆయనను పూజించిన తర్వాత అమృతవాణి , శ్రీ హనుమాన్ చాలీసాను పఠించండి. ఇలా చేయడం వల్ల బజరంగబలి సంతోషించి భక్తుల కోరికలు తీరుస్తాడు. నిజానికి, హిందూ మతంలో కుంకుమను భిన్నమైన ప్రాముఖ్యత ఉంది. ఒక వైపు వివాహిత స్త్రీలు తమ నుదుటి సింధురంగా  కుంకుమని ఉపయోగిస్తారు. మరో వైపు కుంకుమని పూజలో ఉపయోగిస్తారు. కుంకుమను దేవతలకు సమర్పిస్తారు. హనుమంతుడిని సింధూరాన్ని సమర్పిస్తారు. దీని వెనుక ఒక కథ కూడా ఉంది.    

Tuesday Puja Tips: మంగళవారం సింధూరం, శనగలు హనుమంతుడి సమర్పించడం అత్యంత ఫలవంతం.. ఎందుకో తెలుసా..
Lord Hanuman
Follow us on

హిందూ మతంలో హనుమంతుడిని ఆరాధించడానికి మంగళవారం ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. శివుని పదకొండవ అవతారంగా భావించే శ్రీరామ భక్తుడు హనుమంతుని దర్శనంతోనే జీవితంలోని కష్టాలన్నీ తీరతాయని విశ్వాసం. ఎవరైనా హనుమంతుడి ఆశీర్వాదం పొందినట్లయితే ఎటువంటి కష్టాలు, నష్టాలు ఎదురైనా సులభంగా తీరతారయని నమ్ముతారు. హనుమంతుని ఆరాధన వలన సంతోషం, శాంతి, ఆరోగ్యం,  ప్రయోజనాలు లభిస్తాయి. హనుమంతుని భక్తులు ప్రతికూల శక్తుల నుండి కూడా విముక్తి పొందుతారు. శనగలు హనుమంతునికి ఎంతో ప్రీతిపాత్రం. ప్రతి మంగళవారం హనుమంతునికి శనగలను నైవేద్యంగా సమర్పిస్తే ఎవరి జాతకంలోనైనా మంగళదోష ఉంటే .. దాని ప్రభావం తగ్గి జీవితంలో ఎదురయ్యే దుఃఖాలు తొలగిపోతాయి.

హనుమంతుడుని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఆరాదించే సమయంలో పెద్దగా ఏమీ చేయవలసిన అవసరం లేదు. మంగళవారం ఆయనను పూజించిన తర్వాత అమృతవాణి , శ్రీ హనుమాన్ చాలీసాను పఠించండి. ఇలా చేయడం వల్ల బజరంగబలి సంతోషించి భక్తుల కోరికలు తీరుస్తాడు. నిజానికి, హిందూ మతంలో కుంకుమను భిన్నమైన ప్రాముఖ్యత ఉంది. ఒక వైపు వివాహిత స్త్రీలు తమ నుదుటి సింధురంగా  కుంకుమని ఉపయోగిస్తారు. మరో వైపు కుంకుమని పూజలో ఉపయోగిస్తారు. కుంకుమను దేవతలకు సమర్పిస్తారు. హనుమంతుడిని సింధూరాన్ని సమర్పిస్తారు. దీని వెనుక ఒక కథ కూడా ఉంది.

సింధూరం ధరించడానికి గల కారణం..

రామాయణ కథనం ప్రకారం త్రేతాయుగంలో ఒక సారి హనుమంతుడు సీత దేవి తన నుదుట సింధూరం పెట్టుకోవడం చూసి దీనికి కారణం అడిగాడు. అప్పుడు సీతాదేవి.. ఇలా చేసేది శ్రీరాముని దీర్ఘాయువు కోసం అని హనుమంతుడికి చెప్పింది. ఇది విన్న హనుమంతుడు.. శ్రీరాముడు చిటికెడు సింధూరంతో చాలా సంతోషిస్తున్నాడని.. అదే తాను సింధూరాన్ని తన శరీరమంతా ధరిస్తే తన ప్రభువు తన పట్ల ప్రసన్నుడై ఉంటాడని అనుకున్నాడు. ఈ ఆలోచనతో హనుమంతుడి తన శరీరమంతా సింధూరం పూసుకున్నాడు. హనుమంతుడిని సూచిన రాముడు నవ్వడం ప్రారంభించి.. హనుమా నువ్వు ఏమి చేసావు? అని అడిగితే..  ప్రభూ, ఇది నీ దీర్ఘాయువు కోసం అని చెప్పాడు. అప్పుడు తన పట్ల హనుమంతుడికి ఉన్న భక్తిని చూసిన రాముడు చాలా సంతోషించి.. ఈరోజు నుండి ఎవరైతే నీకు సింధూరాన్ని సమర్పిస్తారో అతని కష్టాలన్నీ తొలగిపోతాయని.. ఆ భక్తుడు ఎల్లప్పుడూ రాముడి అనుగ్రహంతో సంతోషంగా ఉంటాడని చెప్పాడు. అందుకే సింధూరం హనుమంతుడికి సమర్పించడం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మంగళవారం పూజా నియమాలు

  1. మంగళవారం తెల్లవారుజామునే నిద్రలేచి శుభ్రం చేసి .. తర్వాత ఎరుపు రంగు దుస్తులు ధరించి హనుమంతుని విగ్రహానికి గంగాజలంతో అభిషేకం చేయాలి.
  2. అనంతరం ఆ విగ్రహాన్ని శుభ్రమైన గుడ్డతో తుడవండి. ఆ తర్వాత సింధూరం నూనె తీసుకుని ముందుగా హనుమంతుడి పాదాల వద్ద సమర్పించండి.
  3. అనంతరం విగ్రహానికి సింధూరాన్ని వర్తింపజేసి తరువాత.. పవిత్ర దారం, ధూప దీపం మొదలైన వాటితో పూజించండి.
  4. శనగలు లేదా బూందీ లడ్డూలను సమర్పించి .. హారతిని సమర్పించి హనుమాన్ చాలీసాను పఠించండి. అనంతరం హనుమంతుని పాదాల నుండి కొద్దిగా సింధూరాన్ని తీసుకొని నుదిటిపై పెట్టుకోండి. దీంతో సమస్యలన్నీ తీరుతాయి.

సింధూరం సమర్పించేటప్పుడు మంత్రం జపించండి

హనుమంతుని విగ్రహానికి సింధూరం సమర్పించాలంటే.. ముందుగా విగ్రహాన్ని నీటితో శుద్ధి చేసి..  పూజ సామాగ్రిని సమర్పించండి. అనంతరం మంత్రం చదువుతూ మల్లెల నూనెలో సింధూరం కలపండి లేదా కొద్దిగా దేశీ నెయ్యిని నేరుగా విగ్రహంపై పూయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు