Tirumala: త‌రిగొండ వెంగ‌మాంబ ధ్యాన‌మందిర నిర్మాణానికి టిటిడీ సన్నాహాలు.. బ్లూ ప్రింట్ సిద్ధం చేయాలని సూచన

|

Feb 09, 2022 | 11:59 AM

Tirumala: తిరుమ‌ల‌లోని త‌రిగొండ వెంగ‌మాంబ బృందావ‌నం( Tarigonda Vengamamba)లో ఉన్న 1.5 ఎక‌రాల స్థ‌లం అభివృద్ధి చేయాల‌ని టిటిడిTTD) ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నిర్ణ‌యించిందని..

Tirumala: త‌రిగొండ వెంగ‌మాంబ ధ్యాన‌మందిర నిర్మాణానికి టిటిడీ సన్నాహాలు.. బ్లూ ప్రింట్ సిద్ధం చేయాలని సూచన
Tirumala
Follow us on

Tirumala: తిరుమ‌ల‌లోని త‌రిగొండ వెంగ‌మాంబ బృందావ‌నం( Tarigonda Vengamamba)లో ఉన్న 1.5 ఎక‌రాల స్థ‌లం అభివృద్ధి చేయాల‌ని టిటిడిTTD) ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నిర్ణ‌యించిందని ఈవో జవహర్ రెడ్డి చెప్పారు. ఇక్క‌డ ధ్యాన‌మందిరం, ఉద్యాన‌వ‌నం ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. త్వ‌ర‌లో ఇందుకు సంబంధించి కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు రూపొందించి, బృందావ‌నం అభివృద్ధి ప‌నులు ప్రారంభించ‌నున్న‌ట్లు ఈవో చెప్పారు.

అంత‌కుముందు ఈవో ఆకాశ‌గంగ ప‌రిస‌రాల్లో భూమి పూజ నిర్వ‌హించే ప్రాంతాన్ని ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. అనంత‌రం గోగ‌ర్భం డ్యాం, రింగ్ రోడ్డు ప‌రిస‌రాల‌లో నూత‌నంగా అభివృద్ధి చేసిన కూడ‌ళ్ళ‌ను, త‌రిగొండ వెంగ‌మాంబ బృందావ‌నంను ఆయ‌న అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు.

టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్వీబిసి సిఈవో శ్రీ సురేష్‌కుమార్‌, ఇంచార్జ్ డిఎఫ్‌వో శ్రీ‌మ‌తి ప్ర‌శాంతి, ఎస్ఇ -2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఇఇ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి, మాజీ టిటిడి బోర్డు స‌భ్యులు శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఆర్ట్ డైరెక్ట‌ర్ శ్రీ ఆనంద సాయి, ఇత‌ర అధికారులు ఈవో వెంట ఉన్నారు.

Also Read:  తిరుమలలో మరో పుణ్యక్షేత్రం.. ఆకాశగంగలో అద్భుత కట్టడం…డిజైన్ మ్యాప్ రిలీజ్(photo gallery)