Tirumala: శ్రీ వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్‌కి ఒక్కరోజే రూ. 85 కోట్ల భారీ విరాళం.. మొత్తం 550 కోట్లు వస్తాయని అంచనా..

|

Feb 18, 2022 | 4:03 PM

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam)... పలు ధార్మిక కార్యక్రమాలతో పాటు, సామజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే..

Tirumala: శ్రీ వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్‌కి ఒక్కరోజే రూ. 85 కోట్ల భారీ విరాళం.. మొత్తం 550 కోట్లు వస్తాయని అంచనా..
Ttd Received A Donation Of
Follow us on

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam)… పలు ధార్మిక కార్యక్రమాలతో పాటు, సామజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తిరుపతిలో చిన్న పిల్లల కార్డియాలజీ ఆసుపత్రి నిర్మాణానికి నిధులను సమకూరిచేందుకు విరాళాల సేకరణ ప్రారంభించింది.  శ్రీ వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్ విరాళాల పథకంలో కోటి రూపాయలను విరాళంగా ఇచ్చే భక్తులకు ఉదయాస్తమాన సేవలను కేటాయించింది. దీంతో ఈ పథకం ప్రారంభం రోజే టీటీడీకి రికార్డ్ స్థాయిలో రూ 85 కోట్ల విరాళం అందింది. చిల్డ్రన్ కార్డియాలజీ ఆసుపత్రి నిర్మాణానికి 85 కోట్ల రూపాయలు విరాళాన్ని దాతలు సమర్పించారు.

టీటీడీ మొత్తం 531 ఉదయాస్తమాన సేవ టికెట్లను అందుబాటులోకి ఉంచగా.. వాటిల్లో శుక్రవారపు సేవ టికెట్ల ను కోటిన్నర రూపాయలుగా నిర్ణయించి….మొత్తం 29 టికెట్లు కేటాయించారు. ఈ 29 టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చిన గంటన్నరలో మొత్తం టికెట్లు కొనుగోలు చేశారు భక్తులు. శుక్రవారం ఉదయాస్తమాన సేవ టికెట్లను కోటిన్నర రూపాయలు విరాళాలు ఇచ్చిన దాతలకు అందజేశారు.

ఇక కోటి రూపాయలతో శుక్రవారం మినహా మిగిలిన రోజుల్లో కేటాయించిన ఉదయాస్తమాన సేవా టికెట్లలో 42 టికెట్లను శ్రీవారి భక్తులు కొనుగోలు చేశారు. దీంతో మొదటి రోజునే సుమారు 70 మంది దాతలు 85 కోట్ల విరాళాలు అందించారని, ప్రతి దాతకు ఒక ఉదయాస్తమాన సేవా టిక్కెట్టును ఆలయ యంత్రాంగం ఉచితంగా కేటాయించిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు.

ఇక ఉదయాస్తమాన సేవలు విక్రయం ద్వారా మొత్తం 550 కోట్లు రూపాయల విరాళాలు వస్తాయని భావిస్తోంది టీటీడీ.

Also Read:

పిల్లల ముందు తల్లిదండ్రులు ఈ నాలుగు విషయాలను గుర్తు పెట్టుకుని మెలగాలంటున్న చాణక్య..