Tirumala: శ్రీవారి ఆలయంపై ఎగురుతున్న డ్రోన్లు.. ఇదిగో సాక్ష్యం అంటున్న స్థానికులు.. ఆలయంపై ప్రయాణం దోషం అంటున్న అర్చకులు

|

Jan 21, 2023 | 5:06 PM

ఆగమశాస్త్రం నిబంధనల ప్రకారం ఆనంద నిలయ గోపురంపై విమానాలు, డ్రోన్లు తిరగడం నిషేధం. అయితే అక్కడ డ్రోన్‌ కెమెరాలు ఎగిరినట్లు కనిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నవంబర్ 13న హైదరాబాద్‌కు చెందిన కిరణ్ రెడ్డి ఇన్‌స్టాలో పోస్ట్ చేసినట్లు గుర్తించారు.

Tirumala: శ్రీవారి ఆలయంపై ఎగురుతున్న డ్రోన్లు.. ఇదిగో సాక్ష్యం అంటున్న స్థానికులు.. ఆలయంపై ప్రయాణం దోషం అంటున్న అర్చకులు
Drone Hulchul Tirumala
Follow us on

కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతిలో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. శ్రీవారి ఆలయంపై డ్రోన్లు ఎగిరినట్లు ఆధారాలు లభించాయి. ఆస్థాన మండపం నుంచి డ్రోన్లు ఎగురవేసినట్లు గుర్తించిన స్థానికులు దాన్ని వీడియో తీశారు. ఏకంగా శ్రీవారి ఆలయాన్నే డ్రోన్‌ ఆపరేటర్‌ వీడియో తీసినట్లు గుర్తించారు. పవిత్ర శ్రీవారి ఆలయంపై డ్రోన్లు ఎగురవేసిన సంఘటన కలకలం రేపుతోంది. డ్రోన్‌ ఎందుకు ఎగురవేశారు..? ఇందులో ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో ఎంక్వైరీ ప్రారంభించింది టీటీడీ. నో ఫ్లయింగ్ జోన్‌లోకి డ్రోన్స్‌ ఎలా వచ్చాయంటూ ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే సెక్యూరిటీ వైఫల్యంపై ఫోకస్ పెచ్చింది.

డ్రోన్‌ కెమెరా దృశ్యాలపై భిన్న కోణాల్లో టీటీడీ విచారిస్తోంది. గతేడాది నవంబర్‌లో డ్రోన్ కెమెరాతో కాకులకోన సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్ చిత్రీకరించారు. ఆ సమయంలో ఆనంద నిలయం ఏరియల్ వ్యూ తీసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లోనే డ్రోన్ విజువల్స్ తీయించినట్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఆగమశాస్త్రం నిబంధనల ప్రకారం ఆనంద నిలయ గోపురంపై విమానాలు, డ్రోన్లు తిరగడం నిషేధం. ఈ క్రమంలో సోషియల్ మీడియాలో ప్రత్యక్షమైన విజువల్స్‌పై విచారణ జరుపుతున్నామన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. విజువల్స్ అఫ్ లోడ్ చేసిన వ్యక్తి హైదరాబాద్‌ వాసిగా గుర్తించామన్న వైవీ.. బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. కుట్రకోణంలో టిటిడిపై దుష్ప్రచారం చేస్తున్నారా అన్న దిశగా కూడా విచారణ జరుపుతున్నామని ప్రకటించారు. రెండు, మూడు రోజుల్లో వాస్తవాలను భక్తులు ముందుంచుతామన్నారు. తిరుమల, కేరళ పద్మనాభస్వామి దేవాలయం, ఇస్రో, ఇతర కొన్ని ముఖ్య పుణ్యక్షేత్రలు, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఉండే ఏరియాను నో ఫ్లై జోన్‌గా ఉన్నాయని డ్రోన్‌ ఎక్స్ ఫర్ట్‌ చెప్పారు.

ఇవి కూడా చదవండి

అసలు ఈ వివాదం ఏంటి? ఆగమశాస్త్రం నిబంధనల ప్రకారం ఆనంద నిలయ గోపురంపై విమానాలు, డ్రోన్లు తిరగడం నిషేధం. అయితే అక్కడ డ్రోన్‌ కెమెరాలు ఎగిరినట్లు కనిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నవంబర్ 13న హైదరాబాద్‌కు చెందిన కిరణ్ రెడ్డి ఇన్‌స్టాలో పోస్ట్ చేసినట్లు గుర్తించారు. దీనిపై వివాదం చెలరేగడంతో నిన్న ఇన్‌స్టా నుంచి వీడియో డిలీట్ చేశాడు కిరణ్. ఐకాన్ ఫ్యాక్స్‌ యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వీడియా ఇంకా కనిపిస్తోంది. డ్రోన్ షాట్ నిజమా? ఫేకా? అన్నదానిపై నిర్ధారణకు రాని అధికారులు.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి రిపోర్ట్ వచ్చాక కేసు నమోదు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదే విషయంపై శ్రీవారి భక్తుల సహా పలువురు స్పందిస్తున్నారు. నష్టం జరిగాక చర్యలు తీసుకోవడం కాదు.. అప్రమత్తంగా ఎందుకు లేరని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నాయకులు. తిరుమలలో డ్రోన్ అంశంపై ఆ పార్టీ నాయకుడు భానుప్రకాష్‌ రెడ్డి స్పందించారు. ఇది కచ్చితంగా భద్రతా వైఫల్యమే అన్నారాయన.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..