TTD Tickets Online: శ్రీవారి భక్తులకు అందుబాటులోకి స్పెషల్ దర్శన టికెట్లు.. ఇంకా ఎన్ని టికెట్లు అందుబాటులో ఉన్నాయంటే..

తిరుమల శ్రీ‌వారి ద‌ర్శనానికి సంబంధించి జులై, ఆగష్టు నెల‌లకు సంబంధించిన రూ. 300 స్పెషల్ టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. రిలీజ్ చేసిన రెండు గంటల్లో 3.50 లక్షల టికెట్లను భక్తులు బుక్ చేసుకున్నారు.

TTD Tickets Online: శ్రీవారి భక్తులకు అందుబాటులోకి స్పెషల్ దర్శన టికెట్లు.. ఇంకా ఎన్ని టికెట్లు అందుబాటులో ఉన్నాయంటే..
Tirumala Tirupati

Updated on: May 21, 2022 | 12:35 PM

TTD Tickets Online: తిరుమల తిరుపతి (Tirumala Tirupati) శ్రీవారి భక్తుల దర్శనానికి సంబంధించిన రూ. 300 ల ప్రత్యేక ప్రవేశదర్శన  టికెట్లను రిలీజ్ చేసింది.  జూలై, ఆగస్టు నెలల కోటాగా శనివారం ఉదయం 9 గంటలకు స్పెషల్ దర్శన టికెట్లను( Specail darshana Tickets) ఆన్ లైన్ లో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులోకి తీసుకుని వచ్చింది. టీటీడీ ఇలా చేయగానే అలా హాట్ కేక్ ల్లా ప్రవేశదర్శన టికెట్లను వెంటనే భక్తులు బుక్ చేసుకున్నారు. జూలై, ఆగస్టు నెలల కోటా టికెట్లను రిలీజ్ చేసిన రెండు గంటల్లో 3.50 లక్షల టికెట్లను భక్తులు బుక్ చేసుకున్నారు.  ప్రస్తుతం ఇంకా ఈ రెండు నెలల నిమిత్తం భక్తులకు 9.85 లక్షల టికెట్లు అందుబాటులో ఉన్నాయి. టికెట్లను టీటీడీ వర్చువల్ క్యూ పద్ధతిలో టికెట్లు కేటాయిస్తున్నారు.  రోజు 25వేల టికెట్లను టీటీడీ అందుబాటులో ఉంచింది. టీటీడీ వెబ్‌సైట్ https://tirupatibalaji.ap.gov.in/ ఆన్‌లైన్‌ ద్వారా  టిక్కెట్లను పొందవచ్చు.

ఓ వైపు సామాన్య భక్తులకు సర్వదర్శన వీలు కల్పించింది. ఈసారి టికెట్ల సంఖ్య పెంచినా కూడా కరోనా తగ్గుముఖం పట్టడంతో భక్తులు వెంటనే బుక్ చేసుకుంటున్నారు. కరోనా తగ్గు ముఖం పట్టినప్పటికీ స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని టీటీడీ స్పష్టం చేసింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి