Ainavilli: తూర్పుగోదావరి జిల్లా(East godavari District)లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి(Ganesha Temple)వారి ఆలయంలో ఏటా నిర్వహించే సప్తనదీ జలాభిషేకం, సరస్వతీయాగం, లక్ష కలాల పూజ వంటి విశేష క్రతువులు ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో భాగంగా సిద్ధివినాయక స్వామివారి చెంత ఉంచిన లక్ష పెన్నుల పంపిణీ కార్యక్రమం ఈరోజు ప్రారంభించనున్నారు. నేటినుండి విద్యార్ధులకు లక్ష పెన్నుల పంపిణీ చేయనున్నారు.
ఈ పెన్నుల పంపిణీ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు కొవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం లక్ష పెన్నులతో విశేష పూజ అనంతరం విద్యార్ధులకు పంపిణీ ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. సిద్ధి వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి స్వామి వద్ద ఉంచిన లక్ష పెన్నులను విద్యార్థులకు నేటి నుంచి ఆలయ అధికారులు పంచానున్నారు.
ఈ పెన్నులు తీసుకునేందుకు స్థానిక విద్యార్ధులతో పాటు.. ఇతర జిల్లాల, ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు రావడం విశేషం. విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యేందుకు అయినవిల్లి సిద్ధి వినాయకస్వామి సన్నిధిలో పూజలో పెట్టిన పెన్నులు ఉపయోగించడం శుభమని నమ్ముతారు.
Also Read: