
ఇక వివాహ జీవితంలో కేవలం సంతోషాలే కాదు.. గోడవలు, కలహాలు, అసంతృప్తులు, సమస్యలు ఇలా అనేకం ఉంటాయి. కానీ ఈ సమస్యలన్నింటినీ దాటి దాటి ముందుకు వెళ్తేనే భార్యా భర్తల బంధం కొనసాగుతుంది. లేదంటే అర్థాంతరంగా వారి బంధాలు నిలిచిపోతాయి. కేవలం మానవ తప్పిదాల వల్లే కాదు.. ఇంట్లోని కొన్ని వాస్తు దోషాల వల్ల కూడా దంపతుల మధ్య కలహాలు అనేవి వస్తూంటాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా వస్తున్నాయి అనుకుంటే మాత్రం.. ఒక్కసారి మీ ఇంటిని పరిశీలించండి. కొన్ని కొన్ని మార్పులు చేర్పుల వల్ల వాటిని పరిష్కరించుకోవచ్చు. మరి అవేంటో తెలుసుకోండి.

మెటల్ తో చేసిన బెడ్ల కంటే చెక్కతో చేసిన బెడ్ లు చాలా ఉత్తమం. అలాగే గోడలపై రంగుల వల్ల కూడా దంపతుల మధ్య కలహాలు ఏర్పడవచ్చు. బెడ్ రూమ్ లో లేత రంగులను మాత్రమే వాడాలి. ఈశాన్య ప్రాంతంలో నీలం లేదా ఊదా రంగులు ఉండేలా చూసుకోవాలి. అలాగే కాంతి అనేది లోపలికి వచ్చేలా చూడాలి.

మాస్టర్ బెడ్ రూమ్ లేదా బెడ్ రూమ్ అనేది నైరుతి ప్రాంతంలో ఉండేలా చూసుకోండి. దీని వల్ల ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదురుతుంది. బెడ్ రూమ్ ని ఎప్పుడూ నీటిగా, అందంగా ఉంచుకోండి. చిందర వందరగా ఉంటే జీవితం కూడా అలాగే ఉంటుంది. అలాగే వంట గది ఆగ్నేయ దిశలో ఉండేలా చూసుకోండి. దీని వల్ల భాగస్వాములిద్దరికీ మానసిక ఆనందం ఉంటుంది.

పడుకునేటప్పుడు తలను దక్షిణం వైపు, కాళ్లు ఉత్తరం వైపు ఉండాలి. ఈ స్థానం మంచి సంబంధానికి దారి తీస్తుంది. పెళ్లైన జంటలు తమ అలంకరణ వస్తువులు ఒకే చోట ఉంచుకోవాలి. మీ పడక గదిలో టీవీ లేదా కంప్యూటర్ వద్ద ఉంచుకోకూడదు.

బెడ్ రూమ్ లో చనిపోయిన వ్యక్తుల ఫొటోలు ఉంచుకోకూడదు. గదిలో పడుకునే సమయంలో భార్యాభర్తల ముఖాన్ని చూడగలిగే అద్దం ఉంటే అది సంబంధానికి ఏ మాత్రం మంచిది కాదు. దంపతులు పడుకునే మంచం ఒకటే అయి ఉండాలి. రెండు చిన్న మంచాలను కలిపి ఒకటిగా చేయకూడదు.