Gangamma Jatara 2026: టెంపుల్ సిటీలో కలర్ ఫుల్ ఈవెంట్..జాతరలో జంబలకడిపంబ!

తిరుపతి నగరం ప్రస్తుతం జాతర సందడితో పులకించిపోతోంది. తిరుపతి గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మ జాతర సంబరాలు వారం రోజులుగా అత్యంత వైభవంగా సాగుతున్నాయి. మే 4వ తేదీ రాత్రి చాటింపుతో మొదలైన ఈ వేడుకలు, నగరం నలుమూలలా డప్పుల దరువులు, భక్తుల కోలాహలం మధ్య ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుతున్నాయి.

Gangamma Jatara 2026: టెంపుల్ సిటీలో కలర్ ఫుల్ ఈవెంట్..జాతరలో జంబలకడిపంబ!
Gangamma Temple Festival

Edited By:

Updated on: May 12, 2026 | 9:28 AM

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఎక్కడ చూసినా జాతర సందడి నెలకొంది. ప్రతి ఇంటా గ్రామ దేవత గంగమ్మ జాతర సంబరమే కనిపిస్తోంది. ఈ నెల 4న రాత్రి జాతరకు చాటింపు వేయగా వారం రోజులుగా డప్పుల దరువు మారుమోగుతోంది. రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న తిరుపతి గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో భక్తుల సందడికి తగ్గట్టుగానే ఏర్పాట్లు జరిగాయి. టీటీడీతో పాటు రాష్ట్ర దేవాదాయ శాఖ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. తిరుపతి పొలిమేర్లలో జాతరకు కైకాల కులస్తులు చాటింపు వేసి అష్టదిగ్బంధనం చేయగా జాతర సంబరం తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామం నుంచి ప్రారంభమైంది. అవిలాల గ్రామ పెద్దలు పుట్టింటి నుంచి సారెను తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి చేర్చగా మే 5న మహాశక్తుల విశ్వరూప స్థూపాలకు విశేష అభిషేకాలు నిర్వహించి గంగమ్మకు వడి బాలు కట్టడంతో జాతర సంబరం అంబరాన్ని అంటింది.

ప్రతి ఏటా చైత్రమాసం చివరి వారంలో గంగమ్మ జాతరను వారం రోజులపాటు జరగనుండగా రోజుకో వేషంతో భక్తులు చిత్ర విచిత్ర అలంకరణలతో గంగమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. 6న బైరాగి వేషం తో మొదలై ఆ తరువాత బండ వేషం, తోటి వేషం, దొర వేషం మాతంగి వేషం తో వేషాల జాతర కొనసాగింది. బైరాగి వేషధారణతో పిల్లలు పెద్దలు కనిపిందు చేయగా శరీరమంతా నామ కొమ్ము, విభూది పూసుకుని రెళ్ళ కాయలు, పుష్పాలు మాలలుగా ధరించి గంగమ్మకు మొక్కులు చెల్లించారు. వేయికళ్ళ దుత్తలతో పురుషులు స్త్రీల వేషంలో గంగమ్మకు మొక్కులు చెల్లించారు. 7న బండ వేషం లో భక్తులు మొక్కులు చెల్లించగా పూలంగి సేవలో గంగమ్మ అనుగ్రహించారు. బండవేషంతో బూతులు తిడుతూ మొక్కులు ఇచ్చిన భక్తులు విశ్వరూపం స్తూపం వద్ద పొంగళ్ళు పెట్టి అంబళ్లు పోసి కోర్కెలు కోరుకున్నారు. ఇక 8న తోటి వేషం ధరించి గంగమ్మకు భక్తులు మొక్కులు చెల్లించగా కైకాల వంశస్థులు చాటతో ఆశీర్వదించారు. రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ గంగమ్మకు సారె సమర్పించగా 9న గంగమ్మకు టీటీడీ సమర్పించింది సారె సమర్పించింది. శ్రీవారి సోదరీగా భావించే గంగమ్మకు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఆనవాయితీగా సారెను టీటీడీ సమర్పించింది. తిరువీధుల్లో సాంస్కృతిక ప్రదర్శనలతో టీటీడీ సారె వైభవాన్ని చాటింది.

…ముందు మూడు రోజులు బూతులే.

ఇక జాతరలో మొదటి మూడు రోజులు భూతులు తిడుతూ అమ్మవారిని కొలిచిన భక్తులు ఆ తర్వాత చిత్ర విచిత్ర వేషాలతో మొక్కులు తీర్చడం ఆనవాయితీగా కొనసాగుతోంది. జాతరలో 6వ రోజైన నిన్న మాతంగి వేషంలో భక్తులు సందడి చేయగా తొలిసారిగా ఈ ఏడాది తిరుపతి తాతయ్య గుంట గంగమ్మకు కాణిపాకం వరసిద్ధి ఆలయం తరుపున సారె సమర్పించగా దర్శకుడు బోయపాటి శ్రీను గంగమ్మకు మొక్కులు చెల్లించు కున్నారు. ఇక జాతరలో ఈ రోజు కైకాల కులస్తులు సున్నపు కుండల వేషాలను ధరించగా మంగళ వారం అసలు జాతర సంబరం జరగనుంది. బలులు ఇచ్చి పొంగళ్ళు పెట్టి వెయ్యికళ్ల దుత్తలు సమర్పించనున్న భక్తులు గంగమ్మ ను దర్శించుకుని మొక్కులు చెల్లించు
కుంటారు.

ఇవి కూడా చదవండి

…జాతరలో కీలక ఘట్టం గంగమ్మ ప్రతిమ చంప నరకడం.

ఇక మంగళ వరం చాటింపుతో ప్రారంభమైన జాతర మంగళవారం చివరి రోజు కీలక ఘట్టంతో ముగుస్తుంది. జాతర ఆఖరి రోజు దాదాపు లక్ష మంది భక్తులు గంగమ్మను దర్శించు
కోనుండగా జాతరలో భక్తులు సప్పరాలతో గంగమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించు కుంటారు.
మగవాళ్ళంతా ఆడవేషాల్లో సందడి చేస్తున్న జాతరలో అర్ధరాత్రి కీలక ఘట్టంగా గంగమ్మ విశ్వరూప దర్శన మిస్తారు. వేలాది మంది భక్తుల మధ్య అమ్మవారి మట్టి ప్రతిమకు పూజలు నిర్వహించనున్న కైకాల వంశస్థులు పేరంటాళ్ల వేషంలో గంగమ్మ ప్రతిమ చెంప నరకడం ద్వారా జాతర ముగుస్తుంది.
ఈ మేరకు జాతరకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం వేలాది మంది భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు బ్యారీకేడ్లు ఏర్పాటు చేసింది. పటిష్ఠమైన పోలీసు బందోబస్తు మధ్య టెంపుల్ సిటీలో వారం రోజుల పాటు కలర్ ఫుల్ ఈవెంట్ జరుగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us