Telugu News Spiritual Tirumala Tirupati Online April 2024 Darshan Ticket and Accommodation Release Date and Time details
Tirupati: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. రేపే ఏప్రిల్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా రిలీజ్.
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా ఏప్రిల్ నెలకు సంబంధించిన వివిధ సేవలకు సంబంధించిన షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. దర్శనం కోసం భక్తులు కొత్త వెబ్ సైట్ నుంచి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూ.. స్వామివారిని ఏప్రిల్ నెలలో దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం దర్శన టికెట్లతో పాటు ఆర్జిత సేవా టికెట్ల కోటాను టిటిడి విడుదల చేయనుంది. ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా ఏప్రిల్ నెలకు సంబంధించిన వివిధ సేవలకు సంబంధించిన షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. దర్శనం కోసం భక్తులు కొత్త వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in/ నుంచి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం జనవరి 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బులు చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను జనవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది.
వర్చువల్ సేవా టికెట్లను జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.
శ్రీవారి వార్షిక వసంతోత్సవం ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు జరుగునుంది.
ఇందుకు సంబంధించిన సేవా టికెట్లను ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది.
ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తుంది.
శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, గదుల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనుండగా వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను జనవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను జనవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ జనవరి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
ఏప్రిల్ నెలకు సంబంధించి జనవరి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను విడుదల చేస్తారు.
ఏప్రిల్ నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల చేసిన టిటిడి
భక్తులు ఈ విషయాలను గమనించి https://ttdevasthanams.ap.gov.in/ వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని కోరుతోంది.