Tirumala Rush: గతనెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య తక్కువే.. కానీ గణనీయంగా పెరిగిన హుండీ ఆదాయం..

|

Jul 02, 2021 | 6:14 PM

Tirumala Rush: కలియుగ ప్రత్యక్షదైవం గా పూజలందుకుంటున్న తిరుమల శ్రీవారి ఆలయం ఎప్పుడూ భక్తుల రద్దీతో నిండి ఉండేది.. స్వామివారిని దర్శించడానికి దేశవిదేశాల నుంచి భారీగా భక్తులు వచ్చేవారు...

Tirumala Rush: గతనెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య తక్కువే.. కానీ గణనీయంగా పెరిగిన హుండీ ఆదాయం..
Tirumala
Follow us on

Tirumala Rush: కలియుగ ప్రత్యక్షదైవం గా పూజలందుకుంటున్న తిరుమల శ్రీవారి ఆలయం ఎప్పుడూ భక్తుల రద్దీతో నిండి ఉండేది.. స్వామివారిని దర్శించడానికి దేశవిదేశాల నుంచి భారీగా భక్తులు వచ్చేవారు. కరోనా వైరస్ కల్లోలం అన్ని రంగాలపై పడినట్లే.. స్వామివారి క్షేత్రం పై కూడా పడింది. లాక్ డౌన్, కరోనా కట్టడి కోసం అమలు చేసిన నిబంధనల నడుమ శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా గత కొన్ని నెలలుగా భారీగా తగ్గింది. అయితే తిరుమలలోని వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించేవారు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ .. హుండీ ఆదాయం గణనీయంగా పెరిగిందని టీటీడీ అధికారులు ప్రకటించారు. గత నెల జూన్లో 4.14 లక్షల మంది భక్తుల శ్రీవారిని దర్శించుకున్నారని.. రూ. 36.02 కోట్ల ఆదాయం వచ్చిందని .. ఇది మే కంటే 200% ఎక్కువని చెప్పారు.

జూన్ నెలలో 1.67 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఈ ఏడాది మార్చిలో హుండీ ఆదాయం రూ .104 కోట్లు ఉందని.. కరోనా సెకండ్ వేవ్ సమయంలో, హుండి ఆదాయం రూ. 11.95 కోట్ల పడిపోయిందని టీటీడీ తెలిపింది.
నిజానికి టీటీడీ 2020-21లో భక్తుల కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 1,300 కోట్ల మేర ఆదాయం ఉంటుందని అంచనా వేసింది. అయితే సెకండ్ వేవ్ విజృంభిచడంతో అంచనా ఆదాయం రూ .725 కోట్లకు పడిపోయింది. దీంతో టిటిడి వార్షిక బడ్జెట్‌ను రూ .2,553 కోట్లకు సవరించారు.

వైరస్ కారణంగా స్వామివారిని దర్శించేకునే భక్తుల సంఖ్య టీటీడీ పరిమితం చేసింది. వేసవిలో భక్తుల భారీ రద్దీ ఉండేది. ఇప్పుడు, ఆ సంఖ్య భారీగా తగ్గింది. అంతకు ముందు 50,000 మంది ప్రజలు మలయప్ప స్వామిని దర్శించుకునేవారు. ఇప్పుడు ఈ సంఖ్య రోజుకు 6,000 కు పడిపోయింది. లడ్డూ ప్రసాదాలు, సేవా టిక్కెట్లు, కల్యాణ కట్టా, వసతి మొదలైన ఇతర వనరుల నుంచి కూడా ఆదాయం లేకపోవడంతో టిటిడి నష్టాన్ని చూసింది.

Also Read: రోడ్ల పక్కన ముళ్ళ పొదల్లో కనిపించే ఈ కాయలు దీర్ధకాలిక రోగాలకు దివ్య ఔషధం