Turumala Hundi: తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ.. మార్చి నెలలో భారీగా శ్రీవారి హుండీ ఆదాయం..
Turumala Hundi: హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి(Tirumala Tirupati). శ్రీవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో(Telugu States) పాటు, దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. స్వామివారిని దర్శించుకుని..
Turumala Hundi: హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి(Tirumala Tirupati). శ్రీవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో(Telugu States) పాటు, దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకుంటారు. కరోనా వెలుగులోకి వచ్చిన అనంతరం రెండేళ్ల తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో తిరుమల ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా సర్వ దర్శనం పునః ప్రారంభించిన అనంతరం తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మార్చి నెలలో కోనేటిరాయుడిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, హుండీ కానుకల వివరాలను టీటీడీ ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే..
మార్చిలో 19.72 లక్షల మందికి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. మార్చి నెలలో స్వామి వారి హుండీ కానుకల ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం రూ.128.64 కోట్లు. 9.54 లక్షల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. 24.10 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు. 1.11 లక్షల లడ్డూలను భక్తులకు పంపిణీ చేశారు. 486.52 ఎమ్ఎల్ డి నీటిని వినియోగించారు. 36.06 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగించారు. 8,028 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారని టీటీడీ అధికారులు వివరించారు. మరోవైపు నేటి నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి ప్రత్యేక దర్శన టికెట్లను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: Sri Ramanavami 2022: శ్రీరామ నవమి సందర్భంగా అరుదైన దృశ్యం.. 5 లక్షల దీపాలతో శ్రీరాముని చిత్ర పటం
Motherhood: మరణించిన భర్తతో సంతానాన్ని పొందాలనుకున్న మహిళ.. సైన్స్ సాయంతో పండంటి బిడ్డకు జన్మ..