తిరుమలలో ఫొటోస్ మరోసారి వివాదంగా మారింది. తిరుమల శ్రీవారి ఆలయం ముందు నలుగురు ప్రైవేటు కెమెరామెన్లు కెమెరాలతో హల్ చల్ చేశారు. ఆలయ మహా ద్వారం ముందు, గొల్ల మండపం ఎదురుగా కెమెరాలతో ఫోటోషూట్ చేశారు. కడప జిల్లా కమలాపురం కు చెందిన మైన్స్ వ్యాపారి వంశీధర్ రెడ్డి స్టిల్స్ తీసేందుకు పోటీపడ్డారు. శ్రీవారి ఆలయం ముందు అనుమతి లేకుండా ఫోటోషూట్ చేసేందుకు వీలు లేకపోయినా కొద్ది సేపు హల్ చల్ చేశారు. అనుమతి లేని చోట ప్రైవేట్ ఫోటోగ్రాఫర్ల హడావుడి ని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులను, సెక్యూరిటీ సిబ్బంది పట్ల దురుసుగా వ్యవహరించారు.
గతంలో నయనతార లాంటి సినీ తారలు కూడా శ్రీవారి ఆలయం ముందు ఫోటోషూట్ చేసి జరిగిన తప్పుకు సారీ చెప్పుకునే పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే ఇప్పుడు వంశీధర్ రెడ్డి, ఆయన వెంట వచ్చిన కెమెరామెన్లు చేసిన పోటో షూట్ నిర్వహించారు. దీంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. అంతేకాదు అటుగా వెళ్తున్న ఓ భక్తుడు ఆగి మరీ పొటోలు తీస్తున్న వారిని, వంశీధర్ రెడ్డిని ఏమిటి ఇది అంటూ ప్రశ్నించాడు. దీంతో వంశీ రెండు నిమిషాల్లో వెళ్ళిపోతానని చెప్పినట్ల తెలుస్తోంది. ఈ ఫోటో షూట్ పై శ్రీవారి భక్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో టీటీడీ విజిలెన్స్ అప్రమత్తమైంది. ఫోటో షూట్ పై ఆరా తీసింది. ఈ మేరకు కేసు నమోదు చేయాలని భావిస్తోంది.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..