Thursday Puja: చేస్తోన్న పనిలో అడ్డంకులా.. ప్రతి గురువారం విష్ణువుని ఇలా పూజించండి..

|

Nov 23, 2023 | 9:10 AM

జీవితంలో విజయం దక్కకుండా ఇబ్బంది పెడుతుంటే.. గురువారం ఉపవాసం ఉండటం వల్ల విజయం కోసం చేసే ప్రయత్నంలో వచ్చే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఈ రోజున చేసే పూజలతో  శ్రీ మహా విష్ణువు మాత్రమే కాదు లక్ష్మిదేవి కూడా సంతోషిస్తుంది. గురువారం ఉపవాసం ఉండటం వల్ల వివాహానికి వచ్చే అడ్డంకులు కూడా తొలగిపోతాయి. గురువార పూజ సమయంలో పరిహారాలు తెలుసుకుందాం..

Thursday Puja: చేస్తోన్న పనిలో అడ్డంకులా.. ప్రతి గురువారం విష్ణువుని ఇలా పూజించండి..
Lord Vishnu Puja
Follow us on

సనాతన హిందూ ధర్మంలో గురువారం శ్రీ మహా విష్ణువు, దేవగురు బృహస్పతి ఆరాధనకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున శ్రీమహావిష్ణువును ఆరాధించడం ద్వారా జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయని విశ్వాసం. ఈ రోజున నియమ నిష్టలతో శ్రీ మహా విష్ణువును ఆరాధిస్తే త్వరగా సంతోషిస్తాడని.. భక్తుల కోరికలు తీరుస్తాడని నమ్మకం. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జీవితంలో విజయం దక్కకుండా ఇబ్బంది పెడుతుంటే.. గురువారం ఉపవాసం ఉండటం వల్ల విజయం కోసం చేసే ప్రయత్నంలో వచ్చే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఈ రోజున చేసే పూజలతో  శ్రీ మహా విష్ణువు మాత్రమే కాదు లక్ష్మిదేవి కూడా సంతోషిస్తుంది. గురువారం ఉపవాసం ఉండటం వల్ల వివాహానికి వచ్చే అడ్డంకులు కూడా తొలగిపోతాయి. గురువార పూజ సమయంలో పరిహారాలు తెలుసుకుందాం..

పసుపు ఉపయోగం

గురువారం రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో పసుపు వేసి, అదే నీటితో స్నానం చేయడం విశిష్టమైన ఫలితం దక్కుతుంది. స్నానం చేసిన తర్వాత ఓం బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని జపించండి.

నుదిటి మీద కుంకుమ పెట్టుకునే సంప్రదాయం

హిందూ మతంలో ప్రతిరోజూ నుదుటిపై తిలకం దిద్దే హిందూ సంప్రదాయంలో ఉంది. అయితే బృహస్పతి, శ్రీ మహా విష్ణువుల ఆశీర్వాదం పొందడానికి ప్రత్యేకంగా గురువారం రోజున కుంకుమ పెట్టుకోవాలని నమ్ముతారు. ఎక్కడికైనా బయటకు వెళుతుంటే నుదిటిపై కుంకుమ ధరించి బయటకు వెళ్లాలి. కుంకుమ అందుబాటులో లేకుంటే పసుపును కూడా ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ చెట్లను, మొక్కలను పూజించండి

బృహస్పతి , విష్ణువును ప్రసన్నం చేసుకోవాలనుకుంటే గురువారం రోజున రావి చెట్టును పూజించాలి. ఈ చెట్టుని పూజించడం వలన ఆశీర్వదం లభిస్తుందని శ్రేయస్కరమని సుఖ సంతోషాలు లభిస్తాయని విశ్వాసం. రావి చెట్టు వేరులో బ్రహ్మ, కొమ్మలో విష్ణువు, పైభాగంలో శివుడు ఉంటాడని నమ్ముతారు. ఈ రోజున తులసిని పూజించడం వల్ల కూడా మేలు జరుగుతుంది.

బట్టలకు సంబంధించిన పరిష్కారాలు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆనందం, శ్రేయస్సు కూడా దుస్తులతో ముడిపడి ఉంటుంది. గురువారం నాడు, దేవ గురువు బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి పసుపు రంగు దుస్తులను ధరించండి. వీలైతే, ఈ రోజున కొత్త బట్టలు ధరించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు