గ్రహణం రోజు నాన్ వెజ్ తింటున్నారా? అయితే, జరిగేది ఇదే..

గ్రహణం పట్టే సమయంలో నాన్ వెజ్ ను తినాలా ? లేదా అని చాలా మంది సందేహిస్తుంటారు. తినని వాళ్ళకి ఏం కాదు. తినే వాళ్ళకి ఒక డౌట్ అనేది తప్పకుండా వస్తుంది. మరి, దీని గురించి పండితులు, జ్యోతిష్యం ఏం చెబుతున్నారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

గ్రహణం రోజు నాన్ వెజ్ తింటున్నారా? అయితే, జరిగేది ఇదే..
Lunar Eclipse

Updated on: Mar 03, 2026 | 11:11 AM

ఈ రోజు మధ్యాహ్నం 3.21 గంటలకు చంద్రగ్రహణం పమొదలయ్యి.. సాయంత్రం 6.48 గంటలకు ఉండనుంది.ఇక మన దేశంలో సాయంత్రం 6.20 గంటల నుంచి చూడాలనుకునే వారు చూడొచ్చు. ఈ సమయంలో కొందరు దేవుని మంత్రాలు చదువుతుంటారు. అయితే, కొన్ని నియమాలు తప్పనిసరి అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది తెలిసి తెలియక చికెన్, మటన్ , చేపలు ఇలా తెచ్చుకుని తింటారు. అసలు గ్రహణం రోజున నాన్ వెజ్ తినొచ్చా? లేదా అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

గ్రహణం పట్టే సమయంలోకోడి గుడ్లు, చికెన్, మటన్, ఫిష్ తినకూడదని పండితులు చెబుతున్నారు. గ్రహణ సమయంలో వీటిని తింటే అనారోగ్య సమస్యలు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. టైం కానీ టైమ్ లో తింటే తిన్న ఆహారం శరీరానికి కూడా పట్టదు.ఇది పూర్తిగా కలుషితం అయిపోతుంది. కాబట్టి, ఈ సమయంలో తిన్న వెంటనే జీర్ణమయ్యే ఫుడ్స్ తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అంటే మాంసాహారాలు, మద్యం జోలికి వెళ్ళకండి.

గ్రహణం రోజు ఈ నియమాలు కచ్చితంగా పాటించండి

తినకూడని ఆహారాలు : చికెన్, మటన్ , ఫిష్ , జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోకండి.
ఏం చేయాలి: స్నానం చేసి గ్రహణానికి ముందు మీరు వండుకున్న ఫుడ్స్ లో అంటే కూరలు, అన్నంలో రెండు చొప్పున తులసి ఆకులు వేయండి.
ఏం తినాలి: పండ్లు, జ్యూస్ లు తాగవచ్చు.
ముఖ్యమైన నియమం: గ్రహణం వీడిన తర్వాత తల స్నానం చేసి, ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని ఆ తర్వాత పసుపు నీళ్ళు చల్లి తినాలి.

నాన్ వెజ్ తింటే జరిగేది ఇదే

మీరు చేసే పనుల్లో దీని ప్రభావం చూపిస్తుంది ఇంకా చెప్పాలంటే నేరుగా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఆ సమయంలో నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దీని కొన్ని అడ్డంకులు , చిక్కులు వస్తాయి. కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో దీనిని గ్రహణ సమయంలో తీసుకోకపోవడమే మంచిది.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us