AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ 5 రాశుల వారు ఎల్లప్పుడూ తప్పుడు వాగ్దాదానాలు ఇస్తారట.. కారణమేంటంటే..

Zodiac Signs: వాగ్దానం.. నేరవేర్చడానికి ఉద్దేశించిబడింది. వాగ్దానం చేయడం చాలా సులభం.. కానీ ఆ వాగ్దానాన్ని నెరవేర్చడంలోనే అసలైన టాస్క్ ఉంది. కొందరు తాము ఇచ్చిన..

Zodiac Signs: ఈ 5 రాశుల వారు ఎల్లప్పుడూ తప్పుడు వాగ్దాదానాలు ఇస్తారట.. కారణమేంటంటే..
Zodiac
Shiva Prajapati
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 01, 2021 | 6:27 AM

Share

Zodiac Signs: వాగ్దానం.. నేరవేర్చడానికి ఉద్దేశించిబడింది. వాగ్దానం చేయడం చాలా సులభం.. కానీ ఆ వాగ్దానాన్ని నెరవేర్చడంలోనే అసలైన టాస్క్ ఉంది. కొందరు తాము ఇచ్చిన వాగ్దానాలను నిజాయితీగా నెరవేరుస్తుంటారు. అయితే, చాలా మంది తాము ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాన్ని మర్చిపోతుంటారు. లైట్ తీసుకుంటారు. ఇంకొందరైతే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నోటికి వచ్చిన ప్రామిస్ చేస్తుంటారు. అలా దానిని అలవాటుగా మార్చుకుంటారు. ఇలాంటి సమాజంలో కోకొల్లలు అనే చెప్పాలి. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ ఐదు రాశుల వ్యక్తులు తరచుగా విశ్వసనీయత లేని వాగ్దానాలు చేస్తుంటారట. అవసరానికి తగ్గట్లుగా ప్రామిస్ చేసి.. ఆ తరువాత దానిని విస్మరిస్తుంటారట. మరి ఆ 5 రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

మేషం.. మేషరాశి వారు ఏమాత్రం ముందు వెనుక ఆలోచించకుండా వాగ్దానాలు చేస్తుంటారు. ప్రాక్టికల్‌గా అది కార్యరూపం దాలుస్తుందా? లేదా? అనే విషయాన్ని పట్టించుకోకుండా ఇష్టారీతిని వాగ్దానాలు చేస్తుంటారు. చాలా వరకు ఏ అంశంపై అయినా ఏమాత్రం ఆలోచించకుండా ఓకే అనేస్తుంటారు. అయితే, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో వీరు సైడ్ ట్రాక్ వెళ్తుంటారు.

తులారాశి.. తులారాశి వారు.. తమ చుట్టూ ఉన్న ప్రజలను ప్రేమిస్తుంటారు. ఈ రాశి వారు తాము చరిత్ర పుటల్లో నిలవాలని తపిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే సాధ్యంకాని హామీలను, వాగ్దానాలను ఇస్తుంటారు. ప్రజలు అడిగిన వాటికి కాదని చెప్పడం కష్టంగా భావించి.. నిలబెట్టుకోలేని వాగ్దానాలు ఇస్తుంటారు.

ధనుస్సు.. ధనుస్సు రాశి వారు సహజంగా మంచి వ్యక్తులు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే ఉద్దేశ్యంతోనే వాగ్దానం చేస్తారు. అయితే, వారి వ్యక్తిగత సమస్యలు వారిని తీవ్రంగా వేధిస్తాయి. ఆ సమస్యల్లోనే వారు మునిగిపోతారు. అలా వారు ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోతారు. తెలియకుండానే వాటిని విస్మరిస్తారు.

కుంభం.. ఈ రాశి వారు తరచుగా వాగ్దానాలు చేస్తుంటారు. వీరు మీ నుంచి ఏదైనా కోరుకుంటే.. తమకు ఉపయోగం అనుకుంటేనే ఇతరులకు ఏమాత్రం ఆలోచించకుండా వాగ్దానం చేస్తారు. ఈ రాశివారు తమ పని పూర్తయిన తరువాత చేసిన వాగ్దానాన్ని విస్మరించే అవకాశం ఎక్కువగా ఉందని జ్యోతిష్యశాస్త్రం పేర్కొంటుంది.

మీనం.. మీనరాశి ప్రజలు అందరికీ సహాయం చేయాలని భావిస్తుంటారు. అందుకే.. ఇష్టారీతిన వాగ్దానాలు ఇస్తుంటారు. అయితే, దానిని నిలబెట్టుకోవడం, ఇచ్చిన హామీని నెరవేర్చడం వారికి కష్టతరం అవుతుంది. ఈ కారణంగానే ఇచ్చిన వాగ్దానాలను దాదాపుగా విస్మరిస్తుంటారు.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాలు, జ్యోతిష్య నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వార్తను పబ్లిష్ చేయడం జరుగుతుంది.

Also read:

Capricorn: మకర రాశి గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియన ఆసక్తికరమైన విషయాలు.. మీకోసం..

Covid 19 Vaccine: వ్యాక్సినేషన్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. ఒక్క రోజులో కోటీ 30 లక్షలకు పైగా వ్యాక్సిన్ల పంపిణీ..

భర్త పుట్టినరోజుకు సర్ ప్రైస్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి..:AP Deputy CM pPushpa Sreevani Photos.