ఇంట్లో ఈ జీవి కనిపిస్తే ధనం, ఆనందానికి చిహ్నం.. త్వరలో సంపద రాబోతుందని అర్థం..?

|

Feb 01, 2022 | 7:16 PM

Spiritual News: ఇంట్లో బల్లి కనిపిస్తేనే భయపడిపోతారు. అయితే ఈ జీవి సంపదకు సూచన ఇస్తుందని మీకు తెలుసా. అవును ఆలయంలో లేదా పూజ గదిలో బల్లులు

ఇంట్లో ఈ జీవి కనిపిస్తే ధనం, ఆనందానికి చిహ్నం.. త్వరలో సంపద రాబోతుందని అర్థం..?
Wealth
Follow us on

Spiritual News: ఇంట్లో బల్లి కనిపిస్తేనే భయపడిపోతారు. అయితే ఈ జీవి సంపదకు సూచన ఇస్తుందని మీకు తెలుసా. అవును ఆలయంలో లేదా పూజ గదిలో బల్లులు కనిపించడం చాలా మంచి సంకేతం. ఈ జీవి రూపం ధన లాభమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలను కూడా సూచిస్తుంది. ఇది ఇంటి ఆర్థిక పరిస్థితిలో మెరుగుదలని చెబుతుంది. భవిష్యత్‌లో జరిగే సంఘటనలను కూడా సూచిస్తుంది. బల్లిని ఎక్కడ చూస్తే శుభం కలుగుతుందో తెలుసుకుందాం.

ఏ రోజు బల్లిని చూడటం శుభప్రదం

దీపావళి రోజు రాత్రి ఇంట్లో బల్లి కనిపిస్తే అది చాలా శుభసూచకం. నిజానికి బల్లి లక్ష్మిదేవిని సూచిస్తుంది. దీపావళి రోజున బల్లి ఇంటికి రావడం లేదా కనిపించడం ఇంట్లో లక్ష్మి రాకను సూచిస్తుందని నమ్మకం.

కొత్త ఇంట్లో బల్లి కనిపిస్తే

కొత్త ఇంట్లో లేదా ఇంట్లోకి ప్రవేశించే సమయంలో బల్లి కనిపిస్తే అది పూర్వీకులు లేదా తండ్రి రాకను సూచిస్తుంది. పూర్వీకులు బల్లుల రూపంలో దర్శనమిచ్చి మనలను ఆశీర్వదించటానికి వస్తారని నమ్మకం. అయితే మీరు కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు చనిపోయిన బల్లి లేదా మట్టిలో పాతిపెట్టినట్లు కనిపిస్తే అది అశుభ సంకేతాన్ని సూచిస్తుంది.

కలలో బల్లిని కనబడటం

కలలో బల్లి పోరాడటం కనిపిస్తే మంచిది కాదు. మీరు కలలో బల్లిని పట్టుకోవాలని ప్రయత్నిస్తే అది భయంతో పారిపోతుంటే అది మంచి సంకేతం. మీరు త్వరలో శుభవార్త అందుకోబోతున్నారని అర్థం.

బల్లుల పోరాటం చూడటం

ఇంట్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ బల్లులు పోరాడుతున్నట్లు కనిపిస్తే అది అశుభ సంకేతాలను ఇస్తుంది. బల్లుల పోరు కూడా ఇంట్లోని వ్యక్తుల మధ్య రిలేషన్‌ షిప్‌ని దెబ్బతీస్తుందని అర్థం. తరచుగా ఇంట్లో గొడవలు జరుగుతాయి.

బల్లి నేల మీద నడిస్తే
ఇంట్లో ఉన్న బల్లి భూమిలో పదే పదే కదులుతున్నట్లు లేదా పాకుతున్నట్లు కనిపిస్తే అది భూకంపం లేదా తుఫాను వంటి ప్రమాదాలను సూచించినట్లు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రాయడం జరిగింది.

NLC Recruitment 2022: ఇంజనీరింగ్‌ విద్యార్ధులకు శుభవార్త.. 550 పోస్టులు.. వెంటనే అప్లై చేసుకోండి..?

Astro News: మీ పిల్లలు ఎంత చదివినా పరీక్షల్లో మరిచిపోతున్నారా.. జ్యోతిష్యం ప్రకారం మెమరీ పవర్ కోసం ఇలా చేయండి..?

Fitness Tips: యోగా చేయడానికి ముందు తర్వాత ఏం తినాలో తెలుసుకోండి..?