Vidya Homam: శ్రీ ఆదిశంకర మఠంలో శ్రీ విద్యా హోమం.. టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం.. పూర్తి వివరాలు

శ్రీ ఆది శంకరాచార్యులు సమస్త మానవాళికి అందించిన ఆధ్యాత్మిక జ్ఞానోదయం, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటానికి అంకితం చేయబడిన పవిత్ర స్వర్గధామం ఆది శంకర మఠం. అలాంటి ఆదిశంకర మఠం తెలంగాణలోని సికింద్రాబాద్ లో కూడా ఒకటి ఉంది. ఇక్కడ ప్రతి నెలలో.. పండగలు, పర్వదినాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సారి ఈ మఠంలో చదువుల తల్లి సరస్వతి దేవి అనుగ్రహం కోసం శీ విద్యా హోమం చేయనున్నది. ఈ హోమంలో పాల్గొనాలనుకునే వారి కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

Vidya Homam: శ్రీ ఆదిశంకర మఠంలో శ్రీ విద్యా హోమం.. టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం.. పూర్తి వివరాలు
Saraswathi Homam

Updated on: Mar 07, 2025 | 3:47 PM

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, తత్వవేత్త శ్రీ ఆది శంకరాచార్యులు బోధించిన వేద సంప్రదాయాలను వివిధ కార్యక్రమాల ద్వారా సమాజానికి అందించడానికి ఆదిశంకర మఠం నిరంతరం కృషి చేస్తోంది. మన సంప్రదాయాన్ని ముందు తరాలకు అందిస్తోంది. శ్రీ ఆదిశంకరాచార్యులు అందించిన దైవిక జ్ఞానం, తత్వాలను ప్రచారం చేస్తూ.. ప్రజలకు మార్గదర్శక కాంతిని అందించే ప్రయత్నం చేస్తోంది తెలంగాణాలోని సికింద్రాబాద్‌లో కౌకూర్ గ్రామం బొలారంలో ఉన్న కాలడి శ్రీ ఆదిశంకర మఠం.

ప్రతి నెలా మానవాళి శ్రేయస్సు కోసం అనేక రకాలైన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. ఈ నేపధ్యంలో ఈ మఠంలో శ్రీ విద్యా హోమం నిర్వహించనుంది. ఈ హోమంలో పాల్గొనలనే ఆసక్తి గల భక్తుల కోసం టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. భక్తులు ఆన్‌లైన్ ద్వారా ప్రత్యేక సేవల్లో పాల్గొనలనుకునే వారికి మాత్రమే కాదు.. ఆన్ లైన్ ద్వారా గోత్ర నామాలతో సంకల్పం చేసుకోవలనుకునేవారు కూడా ఈ శ్రీ విద్యా హోమానికి సంబందించిన టికెట్స్ బుకింగ్ చేసుకోవచ్చు.

శ్రీ విద్యా హోమం విశ్వజ్ఞాన దేవత అయిన శ్రీ సరస్వతీ దేవిని ఆరాధిస్తూ నిర్వహించే పవిత్రమైన వైదిక హోమం. ఈ హోమం ఒక్క విద్యార్ధుల కోసం మాత్రమే కాదు పండితులు, ఉపాధ్యాయులు, జ్ఞానాన్ని కోరుకునే ప్రతి ఒక్కరి కోసం.. శ్రేయస్సుని అందించే ఈ హోమం మేధస్సుని వృద్ధి చేస్తుంది.. విద్యలో విజయాలను అందిస్తుంది. స్పష్టమైన ఆలోచనలకు దారి తీస్తుంది.

మీరు లేదా మీ పిల్లల పేరు పై శ్రీ విద్యా హోమం బుక్ చేసుకోవచ్చు. ఈ హోమంలో ప్రత్యక్షంగా హాజరు కావచ్చు. ఇందుకోసం రూ. ₹ 1,000లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ హోమంలో పిల్లతో పాటు తండ్రి లేదా తల్లి మాత్రమే పాల్గొనగలరు.. అయితే ఇలా ప్రత్యక్షంగా హోమంలో పాల్గొనేందుకు పరిమిత సంఖ్యలో మాత్రమే టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ హోమంలో ఆన్ లైన్ ద్వారా కూడా పాల్గొనవచ్చు. పేరు సంకల్పం, చెబుతారు. ఇందు కోసం రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది. హోమం అనంతరం ప్రసాదం ఇంటికి పంపిస్తారు. ఈ హోమంలో భాగంగా పుస్తకాలు , పెన్నులను ప్రత్యేకంగా పూజిస్తారు. అనంతరం ఈ పవిత్ర ప్రసాదాన్ని అందరికీ అందజేస్తారు. హోమం అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని వితరణ చేస్తారు.

ఈ నేపధ్యంలో శ్రీ విద్యా హోమంలో పాల్గొనేందుకు టికెట్లు బుక్ చేసుకునే వీలుని కల్పిస్తూ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య మహాసంస్థానం ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచింది. ఎవరైనా ఈ సేవలను బుకింగ్‌ చేసుకోవాలనుకున్నా.. మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నా ఈ లింక్‌ని క్లిక్ చేయండి. https://kaladyshankaramadomts.org/index.php/worldline/booking. ఏదైనా సహాయం కావాలంటే 8350903080 కి ఫోన్ చేయవచ్చు అని పేర్కొంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..