Bangaru Bonam: బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం.. సందడిగా విజయవాడ వీధులు

|

Jul 18, 2021 | 12:52 PM

బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్‌ భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆదివారం..

Bangaru Bonam: బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం.. సందడిగా విజయవాడ వీధులు
Bonalu Festival
Follow us on

బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్‌ భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆదివారం విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబతో పాటు ఇతర కమిటీ సభ్యులు పాల్గొని బంగారు బోనాలు తీసుకొస్తున్న వారికి ఆహ్వానం పలికారు.

ఉదయం 10 గంటలకు బ్రాహ్మణ వీధి జమ్మిదొడ్డి వద్ద పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా ఘాట్ రోడ్డు నుంచి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం వరకు కళాకారులతో బోనాల జాతర ఊరేగింపు జరిగింది.

కరోనా మహమ్మారి వ్యాప్తిని నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు ప్రకారం కార్యక్రమం నిర్వహించారు. గత పన్నెండేళ్ల నుంచి దుర్గమ్మకు బోనాలు సమ్పరిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది.

ఇవి కూడా చదవండి: Most Mysterious: షాంగ్రి-లా లోయ.. ఇది అంతు చిక్కని రహస్యం.. ఇంత వరకు ఎవరూ తేల్చని మర్మం..ఇది రెండో బెర్ముడా ట్రయాంగిల్

viral video: కుక్కలు వెంటాడితే ఇలా కూడా చేస్తారా.. యువతి చేసిన పని చూస్తే మతి పోవడం ఖాయం..

IRCTC Tatkal Ticket: ఈ చిన్న చిట్కాతో తత్కాల్ ట్రైన్ టికెట్ బుకింగ్ చాలా ఈజీ.. ఓ సారి మీరు ట్రై చేయండి..

Tirumala Laddu: కొత్త ప్యాకింగ్‌లో తిరుమల లడ్డూ.. కూరగాయల వ్యర్థాలతో లడ్డు బ్యాగ్.. ఎలా తయారు చేస్తారో తెలుసా..