
తమిళ స్టార్ హీరో నటుడు కార్తి, జయం రవి శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఇటీవలే తొలిసారిగా అయ్యప్ప మాల వేసుకున్న కార్తి, నటుడు జయం రవితో కలిసి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఇరుముడితో శబరిమలకు వెళ్లిన కార్తీ, జయం రవిలు గురువారం రాత్రి మణికంఠుడిని దర్శించుకుని స్వామి వారికి ఇరుముడులు సమర్పించారు. ఇటీవల తాను స్వామిమాల ధరించానని.. ఇరుముడి సమర్పించడం కోసమే కొండకు వచ్చానని కార్తి తెలిపారు.
దర్శనం తర్వాత హీరో కార్తి మాట్లాడుతూ తాను తొలిసారి అయ్యప్ప స్వామి మాల వేసుకుని శబరిమలకి వచ్చానని చెప్పారు. ఈ అనుభవం తనకు ఎంతో మానసిక శాంతిని, బలాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. కన్నెస్వామిగా శబరిమలకు రావడం చాలా సంతోషంగా ఉందని. పవళింపు సేవలో స్వామి వారిని దర్శించుకోవడం ఒక ప్రత్యేకమైన అనుభూతినిచ్చిందని కార్తి తెలిపారు. భవిష్యత్తులో కూడా స్వామి వారి దర్శనానికి రావాలని కోరుకుంటున్నట్టు కార్తి చెప్పుకొచ్చారు.
నటుడు జయం రవి మాట్లాడుతూ తాను 2015 నుంచి శబరిమలకు వస్తున్నానని.. ఇప్పటి వరకు 9 సార్లు శబరిమల ఆలయాన్ని దర్శించుకున్నానని తెలిపారు. అయ్యప్ప స్వామిని ఆయన ఎంతో నమ్ముతానని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
• சுவாமியே சரணம் ஐயப்பா
கன்னிச்சாமி ஆக முதல் முறை சபரிமலை வருவது மிகவும் ஆனந்தமாக உள்ளது மகரஜோதிக்கு கண்டிப்பாக வருவேன்… #கார்த்தி #Karthi | @Karthi_Offl #RaviMohan | @iam_RaviMohan #Sardar2 | #VaaVaathiyaar pic.twitter.com/JaiFDcvEPM— Karthi Fans Club Perambalur (@Karthi_Pblr) April 18, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…