గాఢ నిద్రలో కలలు కనే వారు చాలా సంతోషంగా ఉంటారు. చాలా మంది డబ్బు సంపాదించాలని కలలు కంటారు. కొన్నిసార్లు భయంకరమైన గొయ్యిలో పడినట్లు, కొన్నిసార్లు పాములు వెంటాడినట్లు ఇలా రకరకాల కలలు కంటారు. ఈ కలలు జ్యోతిషశాస్త్రంలో రకరకాల సూచనలకు చిహ్నం అని నమ్ముతారు. కలలు కనడం సహజమైన ప్రక్రియ. కనుక జీవితంలోని ప్రతి క్షణం కలలతో ముడిపడి ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కలలు జీవితంతో పాటు వివిధ సూచనలను కలిగి ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం కలలు వివిధ భవిష్యత్ సంఘటనల సంకేతాలను కలిగి ఉంటాయి. కొన్ని కలలు శుభప్రదమైనవి అయితే మరికొన్ని అరిష్ట సూచనలను కలిగి ఉండే కలలు. పురుషులు, మహిళలు వేర్వేరు కలలను కంటారు. బంగారం, వజ్రాభరణాలు మహిళలకు ఇష్టమైన వస్తువులలో ఒకటి. నగలు కొనడంతోపాటు నగలు ధరించడం కూడా ఇష్టం. ఈ నేపధ్యంలో కొన్నిసార్లు వజ్రాలు, కెంపులు కలలో కనిపిస్తాయి. ప్రకాశవంతంగా ఆ నగలు కలలో ప్రకాశిస్తాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు