Sun Rays in Temple: సైన్స్‌కు సవాల్.. ఆ ఆలయంలో ఉగాది రోజున సంధ్య వేళ స్వామివారిని అభిషేకించే సూర్యకిరణాలు

|

Apr 03, 2022 | 1:04 PM

Sun Rays in Temple: మన దేవాలయాలు( Mana Temples), వాటి నిర్మాణాలు అలనాటి వైభవానికి, ఇంజనీరింగ్ ప్రతిభకు తార్కాణాలుగా నిలిచాయి. సహజంగానే పలు దేవాలయాలలో దేవతమూర్తులను భానుడు తెల్లవారుజామున..

Sun Rays in Temple: సైన్స్‌కు సవాల్.. ఆ ఆలయంలో ఉగాది రోజున సంధ్య వేళ స్వామివారిని అభిషేకించే సూర్యకిరణాలు
Sitara Rama Temple
Follow us on

Sun Rays in Temple: మన దేవాలయాలు( Mana Temples), వాటి నిర్మాణాలు అలనాటి వైభవానికి, ఇంజనీరింగ్ ప్రతిభకు తార్కాణాలుగా నిలిచాయి. సహజంగానే పలు దేవాలయాలలో దేవతమూర్తులను భానుడు తెల్లవారుజామున లేలేత కిరణాలతో అభిషేకించడం పరిపాటి.  అయితే ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని ఓ సీతారాముల వారి దేవస్థానంలో మాత్రం భానుడు అస్తమించే సమయంలో సీతారాముల వారిని అభిషేకించడం విశేషం. అదీ ఉగాది రోజు నుంచి మూడు రోజుల పాటు ఈ అద్భుతం ఆవిష్కృతమవుతుంది. దీంతో సీతారాముల దేవస్థానానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. వివరాల్లోకి వెళ్తే..

ప్రకాశం జిల్లా.. చీరాల మండల పరిధిలోని దేవాంగపురి గ్రామంలోని శ్రీ సీతారాములవారి దేవస్థానం శ్రీ సీతారాములవారిని కొన్ని నిముషాల పాటు సూర్యభగవానుడు అస్తమించే వేళలో సూర్య కిరణాలతో స్వామివారిని అభిషేకించాడు. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించిన భక్తులు పరవశించిపోయారు. ఈ సీతారాములవారి దేవస్థానం సుమారు150 సంవత్సరాల చరిత్ర కలిగింది. ప్రతి ఏడాది తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ముందు రోజు మొదలు కొన్ని మూడు రోజుల పాటుగా సూర్యభగవానుడు సీతారాములవారిని ఆస్తమించే వేళలో  సూర్యకిరణాలతో అభిషేకించడం ఆనవాయితీగా వస్తుంది. కేవలం ఉగాది పండుగ మూడు రోజుల పాటు మాత్రమై ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంటుంది. అయితే ఇది నేటికీ ఖగోళ శాస్త్ర వేత్తలకు సైతం అంతు చిక్కని ప్రశ్నగా మారింది.

కాగా సీతారాములవారి ని కొన్ని నిముషాలు పాటుగా సూర్యభగవానునుడు సూర్య కిరణతలో అభిషేకించే అరుదైన ఘటాన్ని తిలకించేందుకు గాను చీరాల పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు . సూర్యభగవానునుడు సీతారాముల వారిని అభిషేకించే దృశ్యాన్ని తిలకించిన భక్తులు దేవతామూర్తుల సేవలో పులకరించిపోయాయారు .ఈ సందర్భంగా దేవతమూర్తులకు భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు ,విశేష అభిషేకాలు నిర్వహించారు.

 

Also Read : Brazil Rains: అకాల వర్షాలకు బ్రెజిల్ అతకుతలం.. 14 మంది మృతి.. ఎమర్జెన్సీ ప్రకటన

Telangana: ఏడాదికి ఒకసారి జాతర సమయంలోనే పాముల రూపంలో అమ్మవార్ల దర్శనం.. భారీగా భక్తులు