Sri Rramanujacharya Millennium Celebrations: హైదరాబాద్(Hyderabad) శివారు శంషాబాద్ కు సమీపంలో ఉన్న ముచ్చింతల్(Muchintal)లో ఆధ్మాత్మిక శోభ విరాజిల్లుతోంది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివస్తున్న భక్తులు 216 అడుగుల భగవద్రామానుజ చార్యుల విగ్రహాన్ని దర్శించుకుని ముచ్చట పడుతున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సదర్శిస్తున్నారు. తాజాగా ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్(RSS Chief Mohan Bhagwat) శ్రీరామనగరికి చేరుకున్నారు. ఆయనకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముచ్చింతల్ లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి తో ఆశ్రమంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్, ఆర్.ఎస్.ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అక్కడి నుంచి శ్రీలక్ష్మీ నారాయణ మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. 108 దివ్య క్షేత్రాలను వారు సందర్శిస్తారు. అనంతరం ప్రవచన మండపంలో జరిగే ధర్మాచార్య సభలో వారు ప్రసంగించనున్నారు. అలాగే.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. ఆర్ఎస్ఎస్ కి చెందిన భయ్యాజీ జోషీ కూడా శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను సందర్శించనున్నారు.
శ్రీరామనగరం భక్తజనంతో నిండిపోయింది. జై శ్రీమన్నారాయణ అంటూ జయజయ ద్వానాలు చేస్తున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి(Sri Chinna Jeeyar Swamy) ఆధ్వర్యంలో ఈ మహాక్రతువు కొనసాగుతోంది. 5 వేల మంది రుత్విజులు యాగశాలలో హోమాలను నిర్వహిస్తున్నారు. శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో 8వ రోజు కార్యక్రమాలు అత్యంత ఆధ్యాత్మికంగా మొదలయ్యాయి. ఉదయం ఆరున్నరకే అష్టాష్టరీ మంత్ర పఠనం జరగ్గా. ఏడున్నరకు పెరుమాళ్ ప్రాతఃకాల ఆరాధన జరిగింది. ఇక తొమ్మిది గంటల నుంచి శ్రీలక్ష్మీనారాయణ మహా యజ్ఞం మొదలైంది. ఆ తర్వాత ఉదయం పదింటికి ఐశ్వర్య ప్రాప్తికై శ్రీలక్ష్మీనారాయణేష్టి సంతాన ప్రాప్తికై వైనతేయ ఇష్టి. పదిన్నరకు యాగశాలలో విద్యార్ధుల విద్యాభివృద్ధి పెద్దల మనోవికాసానికీ హయగ్రీవపూజ.. ఇవాళ్టి సహస్రాబ్ది ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు.
ఇవి కూడా చదవండి: Tukkuguda: అధికార టీఆర్ఎస్ కు షాక్.. బీజేపీలోకి చేరిన తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్
UP Elections: ఎస్పీలో అఖిలేష్ యాదవ్ మేనమామ శివపాల్‌కు అవమానం! బీజేపీలో చేరిన పీఎస్పీ నేతలు..