శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు 35 నిమిషాల్లోనే.. అరగంటలో 2.88 లక్షల టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు

|

Sep 25, 2021 | 9:59 AM

శ్రీవారి సర్వ దర్శనం టోకెన్లు ఆన్ లైన్ లో విడుదలయ్యాయి. అయితే, రిలీజ్ చేసిన టిక్కెట్లు కేవలం 35 నిమిషాల్లో ఖాళీ

శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు 35 నిమిషాల్లోనే.. అరగంటలో 2.88 లక్షల టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు
Tirumala Darshanam
Follow us on

Sarvadarshanam Bookings – Tirumala: శ్రీవారి సర్వ దర్శనం టోకెన్లు ఆన్ లైన్ లో విడుదలయ్యాయి. అయితే, రిలీజ్ చేసిన టిక్కెట్లు కేవలం 35 నిమిషాల్లో ఖాళీ అయిపోయాయి. ఈ ఉదయం 9 గంటలకు శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు ఆన్ లైన్ లో విడుదల చేసింది టీటీడీ. అయితే, ఆశ్చర్యకరంగా విడుదల చేసిన 35 నిమిషాల్లో ఏకంగా 2.88 లక్షల టికెట్లు బుక్ చేసుకున్నారు భక్తులు.

టికెట్ల బుకింగ్ కు ఉన్న విపరీతమైన డిమాండ్ ను ఎదుర్కోవడానికి వర్చువల్ క్యూ పద్ధతిలో టికెట్ల కేటాయింపు చేశారు. వర్చువల్ క్యూ ద్వారా ముందుగా వెబ్ సైట్ లో లాగిన్ అయిన వారికి అవకాశం కల్పించారు. వర్చువల్ క్యూ పద్ధతి పాటించడంతో సర్వర్ల క్రాష్ సమస్య ఈ సారి తప్పింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా టికెట్లు బుక్ చేసుకున్నారు భక్తులు.

ఇదిలాఉంటే, తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సంఖ్య పెరుగుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దర్శనానికి వచ్చే భక్తులకు పలు నిబంధనలు విధించింది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిపికెట్ తప్పనిసరిగా చూపాలని ఆలయ ఈవో జవహార్ రెడ్డి స్పష్టం చేశారు. లేదంటే.. మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకున్న నెగెటివ్ సర్టిఫికెట్ అయినా తీసుకురావాలన్నారు.

టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యకార్యదర్శిగా ఈవో జవహార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ విధానం అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. అయితే, 12 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు ఈ నిబంధన నుంచి సడలింపు ఇస్తున్నట్లు తెలిపిన ఆయన.. ఆధార్ కార్డు తప్పనిసరి అని తెలిపారు. ఇక 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయస్సు గలవారికి దర్శనం తేదీ నుంచి 72 గంటల ముందు కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి.

Read also: Bank Scam: కుమ్మక్కైన బ్యాంక్ మేనేజర్.. తాడేపల్లిగూడెం యూనియన్ బ్యాంకులో పెద్ద ఫసక్.!