Siddha Mangala Stotram: మానసికప్రశాంత, చేపట్టిన పనుల్లో విజయం కోసం.. ఈ స్తోత్రాన్ని రోజూ 9 పఠిస్తే అద్భుత ఫలితాలు మీసొంతం

|

Aug 07, 2021 | 7:24 AM

Siddha Mangala Stotram: సిద్ధ మంగళ స్తోత్రాన్ని నిత్యం 9 సార్లు పారాయణ చేయడం ద్వారా సర్వ సౌఖ్యములు, మానసీక ప్రశాంతత లభిస్తుంది. ఈ స్తోత్రం చాలా మహిమాన్వితమైనది..

Siddha Mangala Stotram: మానసికప్రశాంత, చేపట్టిన పనుల్లో విజయం కోసం.. ఈ స్తోత్రాన్ని రోజూ 9 పఠిస్తే అద్భుత ఫలితాలు మీసొంతం
Siddha Mangala Stotram
Follow us on

Siddha Mangala Stotram: దత్తాత్రేయ స్వామి పునర్జన్మగా శ్రీపాద వల్లభ స్వామిని భావిస్తారు. శ్రీపాద వల్లభ స్వామి తూర్పుగోదావరిజిల్లా లోని పిఠాపురం అనే గ్రామంలో అప్పలరాజు శర్మ, సుమతి మహారాణి పుణ్య దంపతలుకు జన్మించారు. వీరిని ప్రథమ దత్తాత్రేయ స్వామి వార్ల అవతారం భావిస్తారు. ఈ స్వామివారిని పూజిస్తూ .. సిద్ధ మంగళ స్తోత్రాన్ని పఠిస్తే అద్భుత ఫలితాలు పొందారు. ముఖ్యంగా ఈ సిద్ధ మంగళ స్తోత్రాన్ని నిత్యం 9 సార్లు పారాయణ చేయడం ద్వారా సర్వ సౌఖ్యములు, మానసీక ప్రశాంతత లభిస్తుంది. ఈ స్తోత్రం చాలా మహిమాన్వితమైనది. భక్తితో పారాయణం చేసిన వారు సర్వ కార్యాలలో విజయాలు సాధిస్తారు అనుటలో సందేహం లేదని భక్తుల నమ్మకం..

సిద్ధ మంగళ స్తోత్రం:

శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీనరసింహ రాజా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

సవితృకాఠక చయన పుణ్యఫల భరద్వాజ ఋషీగోత్ర సంభవా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

దోచౌపాతీదేవ లక్ష్మీ ఘన సంఖ్యా భోదిత శ్రీచరణా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

పుణ్యరూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాతా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

సుమతీ నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

పీఠికాపుర నిత్య విహారా మధుమతి దత్త మంగళరూప
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ….

శ్రీ దత్త శ్శరణం మమ
శ్రీపాద రాజం శరణం ప్రపద్యే
దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా

Also Read: దుర్గమ్మ దయతోనే ఒలింపిక్స్‌లో గెలుపొందా .. నెక్స్ట్ ఒలింపిక్స్‌లో గోల్డ్ సాధిస్తా: పీవీ సింధు