MellaChervu: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని మై హోమ్ ఇండస్ట్రీస్(My Home Industries) లో అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు (Sri Venkateswara Swamy Kalyanotsavam) ప్రారంభమయ్యాయి. స్వామివారి కల్యాణోత్సవాలు 6 రోజుల పాటు జరగనున్నాయి. ఈ నెల 24వ తేదీన శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగనున్నది. ఈ కల్యాణోత్సవం మై హోమ్ ఇండస్ట్రీస్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు దంపతులు పాల్గొన్నారు. 24 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తున్న కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుడి బాధ్యత వహిస్తాడు. ఈ బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసేందుకు తొలిరోజు విశ్వక్సేనుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య అగ్ని ప్రతిష్ట చేసి జలానికి పూజచేసి ఆలయాన్ని సంప్రోక్షణ చేసి పుణ్యాహ వాచనం, వేదపండితులు రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.
సాయంత్రం మంగళ వాయిద్యాలతో పుట్ట బంగారంతో నవ ధాన్యాలను నాటి ఉత్సవాలకు నాంది పలికారు. వేద పండితులు ఉత్సవాలకు అంకురార్పణ, ధ్వజాధి వాసం నిర్వహించారు. కన్నుల పండువగా సాగిన తొలిరోజు ఉత్సవాలలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.
Reporter: Revan Reddy, Tv9 Telugu
Srisailam: నేడు శ్రీశైలంలో భ్రమరాంబదేవికి కుంభోత్సవం.. పలు సేవలు రద్దు..