Naga Panchami: నాగ దోషంతో ఇబ్బంది పడుతున్నారా.! నాగ పంచమి రోజున ఈ మంత్రాలతో పూజించండి.. శుభ సమయం ఎప్పుడంటే..?

|

Jul 15, 2024 | 8:55 AM

హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజు ఈ సంవత్సరం ఆగస్టు 9వ తేదీ. ఈ రోజు నాగదేవతకు పూజలు చేస్తారు. పంచమి తిథి ఆగస్టు 9వ తేదీ ఉదయం 8:15 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6:09 గంటలకు ముగుస్తుంది. నాగ పంచమి రోజున నాగదేవతను పూజిస్తే జాతకంలో ఉన్న నాగదోషం తొలగిపోతుందని.. పాముల వలన కలిగే భయం కూడా తొలగిపోతుందని మత విశ్వాసం.

Naga Panchami: నాగ దోషంతో ఇబ్బంది పడుతున్నారా.! నాగ పంచమి రోజున ఈ మంత్రాలతో పూజించండి.. శుభ సమయం ఎప్పుడంటే..?
Naga Panchami Puja
Follow us on

నాగ పంచమి హిందూ మతంలో ప్రధాన పండుగలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ పండుగ శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజు వస్తుంది. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజిస్తారు. కాలసర్ప దోష నుంచి విముక్తి ఇచ్చే ఈ రోజు చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో 2024 సంవత్సరంలో నాగ పంచమి ఎప్పుడు వచ్చింది? ఈ రోజున పూజకు శుభ సమయం ఎప్పటి వరకు ఉంటుందో తెలుసుకుందాం.

నాగ పంచమి 2024 ఎప్పుడంటే

హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజు ఈ సంవత్సరం ఆగస్టు 9వ తేదీ. ఈ రోజు నాగదేవతకు పూజలు చేస్తారు. పంచమి తిథి ఆగస్టు 9వ తేదీ ఉదయం 8:15 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6:09 గంటలకు ముగుస్తుంది.

నాగ పంచమి 2024 పూజ శుభ సమయం

నాగ పంచమి రోజున నాగదేవతను పూజించే శుభ సమయం రోజంతా ఉంది. ఆగస్టు 9వ తేదీన ఎప్పుడైనా పూజ చేయవచ్చు. అయితే ఆగస్ట్ 9 మధ్యాహ్నం 12:13 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రత్యేక పూజలకు అనుకూలమైన సమయం. ప్రదోష కాలంలో ఈ రోజున నాగదేవతను ఆరాధించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఆగష్టు 9వ తేదీ ప్రదోష కాలంలో సాయంత్రం 6:33 నుంచి 8:20 గంటల వరకు నాగదేవతను పూజించవచ్చు.

ఇవి కూడా చదవండి

నాగ పంచమి రోజున నాగ పూజ చేయడం వలన కలిగే ప్రయోజనాలు

నాగ పంచమి రోజున నాగదేవతను పూజిస్తే జాతకంలో ఉన్న నాగదోషం తొలగిపోతుందని.. పాముల వలన కలిగే భయం కూడా తొలగిపోతుందని మత విశ్వాసం. నాగ పంచమి రోజున పాములను పూజించడం వలన కుటుంబ సభ్యులకు కూడా పాముల నుంచి రక్షణ లభిస్తుందని నమ్మకం.

నాగ పంచమి రోజున నాగదేవతను లేదా నాగ పాముని పూజించడం వలన వైవాహిక జీవితంలో సమస్యలు లేదా సంతానం కలగడంలో సమస్యల ఉన్నా ఉపశమనం పొందుతారని కూడా చెబుతారు. శివునికి పాములంటే చాలా ఇష్టం. కనుక నాగుపాముని పూజించడం వలన శివుని అనుగ్రహం కూడా కలుగుతుందని శివుడు ప్రసన్నుడై భక్తులను అనుగ్రహిస్తాడని నమ్మకం. పాముని పూజించడం వల్ల ఆధ్యాత్మిక పురోభివృద్ధితోపాటు కోరికలు కూడా నెరవేరుతాయి.

ఈ మంత్రాలతో నాగేంద్రుడిని పూజించండి.

ఓం శ్రీ భిలత్ దేవాయ నమః (ॐ श्री भीलट देवाय नम:) అని లేదా
భుజంగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్ ||

భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్||

సర్వేం నాగాః ప్రీయన్తాం మే యే కేచింత పృధ్వితలే | యే చ హేలిమరీచిస్థా యే న్తరే దివి సంస్థితః (सर्वे नागा: प्रीयन्तां मे ये केचित् पृथ्वीतले। ये च हेलिमरीचिस्था ये न्तरे दिवि संस्थिता:।।)

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు