Srisailam Rush: శ్రావణ శోభను సంతరించుకున్న శ్రీశైలం.. మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు.. 8 గంటల సమయం

| Edited By: Surya Kala

Aug 21, 2023 | 12:04 PM

మల్లన్న దర్శనం కోసం భక్తులు దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు.  శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో లవన్న ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Srisailam Rush: శ్రావణ శోభను సంతరించుకున్న శ్రీశైలం.. మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు.. 8 గంటల సమయం
Devotees Rush In Srisalam
Follow us on

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి అయిన  శ్రీశైలం శ్రావణ శోభను సంతరించుకుంది. ముక్కంటి ఆలయానికి శ్రావణమాసం సోమవారం కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది క్షేత్రమంత భక్తజనంతో సందడి నెలకొంది భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి చేరుకుంటున్నారు.

మల్లన్న దర్శనం కోసం భక్తులు దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు.  శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో లవన్న ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, మంచినీరు అందిస్తున్నారు. అయితే నిజ శ్రావణమాసం మొదలవడంతో శివయ్య దర్శనం కోసం మల్లన్న క్షేత్రానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తారని..  భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. అందుకు తగిన ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..