Somnath Temple: చంద్రుడిని శాప విముక్తి చేసిన జ్యోతిర్లింగ క్షేత్రం.. శివయ్యను పూజిస్తే చంద్ర దోష నివారణ

|

Jul 28, 2024 | 5:38 PM

గుజరాత్‌లోని కతియావార్ ప్రాంతంలో సముద్రతీరంలో ఉన్న దాదాపు 155 అడుగుల ఎత్తులో ఉన్న సోమనాథ ఆలయం ప్రతి యుగంలోనూ ఉందని నమ్మకం. పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని మొదట చంద్ర దేవుడు నిర్మించాడు. ఇది తరువాత ముస్లిం దాడుల్లో ఆరుసార్లు విచ్ఛిన్నమైంది. ఈ గొప్ప ఆలయాన్ని చివరిసారిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్మించారు. ఈ ఆలయ శిఖరంపై 10 టన్నుల భారీ కలశాన్ని అలంకరించారు.

Somnath Temple: చంద్రుడిని శాప విముక్తి చేసిన జ్యోతిర్లింగ క్షేత్రం.. శివయ్యను పూజిస్తే చంద్ర దోష నివారణ
Somnath Jyotirlinga Temple
Follow us on

హిందూ మతంలో భోలాశంకరుడు .. కోరిన కోర్కెలు తీర్చే శివయ్యను భక్తి శ్రద్దలతో భక్తులు పూజిస్తారు. శివాలయాలతో పాటు ద్వాదశ జ్యోతిర్లింగాలకు గొప్ప మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఈ 12 జ్యోతిర్లింగాలలో మొదటి స్థానం గుజరాత్‌లోని ద్వారకలో ఉన్న సోమనాథ ఆలయానికి ఉంది. మహాదేవుడుతో అనుబంధం ఉన్న ఈ జ్యోతిర్లింగాన్ని చంద్ర దేవుడు తన శాపం నుండి విముక్తి పొందడానికి శివయ్యను ప్రతిష్టించి మొదట పూజించాడని నమ్ముతారు. శివారాధనకు ఉత్తమమైనది. అత్యంత ఫలప్రదమైనదిగా పరిగణించబడే శ్రావణ శివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంది.

గుజరాత్‌లోని కతియావార్ ప్రాంతంలో సముద్రతీరంలో ఉన్న దాదాపు 155 అడుగుల ఎత్తులో ఉన్న సోమనాథ ఆలయం ప్రతి యుగంలోనూ ఉందని నమ్మకం. పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని మొదట చంద్ర దేవుడు నిర్మించాడు. ఇది తరువాత ముస్లిం దాడుల్లో ఆరుసార్లు విచ్ఛిన్నమైంది. ఈ గొప్ప ఆలయాన్ని చివరిసారిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్మించారు. ఈ ఆలయ శిఖరంపై 10 టన్నుల భారీ కలశాన్ని అలంకరించారు.

సోమనాథ జ్యోతిర్లింగ ప్రాముఖ్యత

ఇవి కూడా చదవండి

పురాణాల ప్రకారం శివునికి చెందిన ఈ పవిత్ర నివాసం ఒకప్పుడు చంద్ర దేవుడు తన జీవితానికి సంబంధించిన శాపం నుండి ఉపశమనం పొందేందుకు నిర్మించాడని నమ్ముతారు. ఒకసారి చంద్రుడి మామగారైన దక్షుడు.. తన కూతుర్ల మీద చూపిస్తున్న పక్షపాతాన్ని సహించలేక చంద్రునిపై కోపం తెచ్చుకున్నాడు. చంద్రుడు కాంతిని కోల్పోయి.. రోజురోజుకు మసకబారుతుందని శపించాడు.

దీని తరువాత ఈ శాపం నుండి విముక్తి పొందడానికి చంద్రుడు సరస్వతీ నదీ ముఖద్వారం వద్ద ఉన్న అరేబియా సముద్రంలో స్నానం చేసి మహాదేవుని ఈ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్టించి, సకల క్రతువులతో పూజించాడు. దీనితో సంతోషించిన మహాదేవుడు చంద్రుడికి శాప విముక్తిని ప్రసాదించాడు. చంద్రుని పేరుతో ఈ ప్రదేశాన్ని సోమనాథ్ అని పిలుస్తారు.

పూజ చేయడం ద్వారా ఏ ప్రయోజనాలను పొందుతారంటే

ఎప్పుడూ మానసిక ఆందోళన లేదా ఒత్తిడితో ఇబ్బంది పడేవారు లేదా డిప్రెషన్ సమస్య ఉన్నవారు మహా శివరాత్రి రోజున మొదటి జ్యోతిర్లింగాన్ని అంటే మహాదేవుని సోమనాథ్ శివలింగాన్ని పూజిస్తారు.

సోమనాథ్ శివలింగ ఆరాధనకు మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాకుండా జ్యోతిషశాస్త్రపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో చంద్ర దోషం ఉన్నా.. చంద్రుడు క్షీణించి దశలో ఉన్నా.. లేదా అస్తమించడం వల్ల ఇబ్బందులు కలిగిస్తున్నా వారు చంద్రుని దోషాన్ని తొలగించుకోవడానికి శ్రావణ శివరాత్రి ప్రదోష కాలంలో తెల్లని బట్టలు ధరించి సోమనాథ్ శివలింగాన్ని పూజించాలి.

సోమనాథ శివలింగాన్ని ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించి పూజించాలి. అలాగే ఈ పవిత్ర జ్యోతిర్లింగాన్ని పూర్ణ విశ్వాసంతో పూజించిన వ్యక్తికి కంటికి సంబంధించిన సమస్యలు, వ్యాధులు తొలగిపోతాయని సోమనాథ్ శివలింగం గురించి ఒక నమ్మకం. అందుకనే దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు