సూర్య , చంద్ర గ్రహణాలు అనేవి ఖగోళ సంఘటనలు. నేడు సూర్య గ్రహణం.. అంటే చంద్రుడు పాక్షికంగా లేదా పూర్తిగా సూర్యుడిని కప్పి.. భూమిపై నీడను పడకుండా చేస్తాడు. అయితే సూర్యగ్రహణం సమయంలో వెలువడే కిరణాలు హానికరమైనవి అని .. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నమ్ముతారు. ముఖ్యంగా హిందువులు గ్రహణం ఏర్పడే సమయాన్ని సూత కాలంగా భావించి అనేక చర్యలు పాటిస్తారు. గ్రహణ సమయంలో బయటకు వెళ్ళడానికి కూడా ఇష్టపడరు.. అంతేకాదు ఆహారం వంటివి తీసుకోకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. మరోవైపు సూర్యగ్రహణం ఏర్పడే సమయంలో ఏర్పడే ప్రతికూలతను తొలగించడానికి కొందరు ప్రత్యేక ప్రార్ధనలు చేస్తారు. ఆచార నియమాలను పాటిస్తారు.
శాస్త్రీయ సంఘం ఇటువంటి నమ్మకాల విషయంపై అవగాహన కల్పిస్తూనే.. సూర్యగ్రహణం ఏర్పడే సమయంలో కంటి రక్షణ వంటి విషయాల ప్రాముఖ్యతను వివరిస్తూ ఉంటాయి. ఈ ఏడాదిలో చివరి సూర్యగ్రహణం నేడు ఏర్పడనుంది. ఈ గ్రహణం యునైటెడ్ స్టేట్స్, మెక్సికో , మధ్య దక్షిణ అమెరికాలోని అనేక ఇతర దేశాలలో కనిపిస్తుంది.
దృష్టి భద్రత: సూర్యగ్రహణం సమయంలో అత్యంత ముఖ్యమైన ఆరోగ్య ప్రమాదం.. కంటి చూపు. సూర్య గ్రహణ సమయంలో సూర్యుడిని నేరుగా చూడటం వల్ల సోలార్ రెటినోపతితో సహా తీవ్రమైన కంటి సమస్యలు సంభవించవచ్చు.
అతినీలలోహిత కిరణాలు: సూర్య గ్రహణ సమయంలో భూమి ఉపరితలంపై చేరే అతినీలలోహిత (UV) కిరణాల రేడియేషన్‌లో పెరుగుదల ఉంటుంది. ఈ కిరణాలు UV స్థాయిలకు ఎక్కువగా ఉండడంతో చర్మం దెబ్బతినే అవకాశం ఉంది. వడదెబ్బ, స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
సూర్య కాంతి నుంచి కంటి రక్షణ: సూర్యగ్రహణం సమయంలో గ్రహణాన్ని చూడడం మంచిది కాదు. ఒకవేళ చూడాలని అనుకుంటే.. సూర్యరశ్మి నుంచి కంటి చూపుని రక్షించుకోవడం కోసం కంటి అద్దాలు వంటి వాటిని రక్షణ కోసం ఉపయోగించడం చాలా ముఖ్యం. అయితే రెగ్యులర్ గా ఉపయోగించే సన్ గ్లాసెస్ సరిపోవు .. ఈ కంటి అద్దాలు తీవ్రమైన సూర్యకాంతి నుండి తగిన రక్షణను కంటికి ఇచ్చే అవకాశం అతి తక్కువ.
చర్మ రక్షణ: పెరిగిన UV రేడియేషన్ నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా అధిక SPF ఉన్న సన్‌స్క్రీన్‌ని ఉపయోగించడం.. రక్షిత దుస్తులు ధరించడం.. నీడలో ఉండడం వంటి చర్యలు తీసుకోవాలి.
ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు: సూర్యగ్రహణం సమయంలో ఉష్ణోగ్రతలో తాత్కాలిక తగ్గుదల ఉండవచ్చు. ఉష్ణోగ్రత మార్పులకు సంబంధించిన అసౌకర్యం, ఆరోగ్య సమస్యలను నివారించడానికి తగిన దుస్తులు ధరించాలి.
మానసిక ఆరోగ్యం పై ప్రభావం: సూర్య గ్రహణం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందనేది ఆధారం లేని భయం అంటూ నిపుణులు చెబుతున్నారు. అయితే కొందరు తప్పుడు ప్రచారంతో ఒత్తిడి, ఆందోళనకు దోహదం చేస్తుంది. గ్రహణాలకు సంబంధించిన మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి స్పష్టమైన కమ్యూనికేషన్, ఖచ్చితమైన సమాచారం అందరికి తెలిసేలా చేయాలి.
ఆరోగ్య అవగాహన: సూర్యగ్రహణాలు కంటి భద్రత, చర్మ రక్షణ , ఆరోగ్యంపై UV రేడియేషన్ ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే లా చర్యలు తీసుకోవాలి. అవగాహన పెంచడానికి, నివారణ చర్యలను ప్రోత్సహించడానికి ప్రజారోగ్య ప్రచారాలను నిర్వహించాల్సి ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.