Sita Devi: రావణుడిని కేవలం చూపుతోనే భస్మం చేసే శక్తి సీతాదేవి సొంతం.. అయినా రామయ్య కోసం ఎందుకు చూసిందో తెలుసా..

హిందూ మతంలో ఆదర్శ మహిళ అంటే సీతాదేవి. శ్రీ మహా లక్ష్మి అవతారం అయిన సీతాదేవి విష్ణువు అవతారమైన శ్రీ రాముడు పత్ని. తన నడకతో నడతతో సీతాదేవి తరతరాలకు మార్గదర్శకంగా నిలిచిపోయింది. రావణుడు సీతను అపహరించినప్పుడు.. ఆమె కోరుకుంటే ఆమె ఒక్క చూపుతో రావణుడిని బూడిద చేసి ఉండేది.. అయినా ఆమె అలాంటిదేమీ చేయలేదు. తనను రావణుడి చెర నుంచి విడిపించేందుకు సీతా దేవి తన భర్త శ్రీరాముని కోసం వేచి ఉంది. దీని వెనుక కూడా ఒక కారణం ఉంది.

Sita Devi: రావణుడిని కేవలం చూపుతోనే భస్మం చేసే శక్తి సీతాదేవి సొంతం.. అయినా రామయ్య కోసం ఎందుకు చూసిందో తెలుసా..
Sita Devi

Updated on: May 04, 2025 | 6:57 PM

సీతాదేవిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. రామాయణంలో సీతదేవిని ఓపిక, ప్రకాశవంతమైన, అంకితభావం కలిగిన మహిళగా చిత్రీకరించారు. ఆమె అపారమైన శక్తి కలిగిన స్త్రీ మూర్తి. ఆమె కోరుకుంటే రావణుడు తనని అపహరించే సమయంలో ఒక్క చూపుతో రావణాసురుడిని దహనం చేసే శక్తి కలిగి ఉంది. ఇది మాత్రమే కాదు తనని అశోక వనంలో బందీగా చేసిన సమయంలో కూడా రావణుడిని శిక్షించే శక్తి ఆమెకు ఉంది. అయినప్పటికీ ఆమె అలా చేయలేదు. రాముడి చేతిలో రావణుడి మరణం ఖాయమని సీతాదేవికి తెలుసు. అందుకనే తన భర్తని గౌరవాన్ని.. ధర్మాన్ని అనుసరిస్తూ స్వయంగా ఎటువంటి చర్య తీసుకోలేదు. అంతేకాదు సీతాదేవి.. దశరథ మహా రాజుకు చేసిన వాగ్దానం కారణంగా కూడా అలా చేయలేదు.

గడ్డి కూడా బూడిద అయిపోయింది

పురాణాల ప్రకారం సీత దేవి శ్రీరాముడిని వివాహం చేసుకుని.. తన అత్తమామల ఇంటికి వచ్చిన తర్వాత.. సీతదేవి మొదట ఋషులు, కుటుంబ సభ్యుల కోసం పాయసం చేసింది. ఆమె వారికి పాయసం వడ్డిస్తుండగా, బలమైన గాలి వీచింది. అందరూ తమ తమ ప్లేట్లను జాగ్రత్తగా చూసుకున్నారు.. అయితే ఆ సమయంలో దశరథుని పాయసంలో ఒక చిన్న గడ్డి ముక్క పడింది. అప్పుడు సీతదేవి పాయసంలో పడిన గడ్డిని చూసింది. ఆమె పాయసంలోని ఈ గడ్డిని ఎలా తీయాలి అని ఆలోచించడం ప్రారంభించింది. అది ఆమెకు పెద్ద సందిగ్ధంగా మారింది. తర్వాత దూరం నుంచి తీక్షణ దృష్టితో గడ్డిని చూసింది. సీతాదేవి చూపుతోనే ఆ గడ్డి బూడిదగా మారిందని అంటారు. సీతా దేవి ఇలా చేసినప్పుడు తనని ఎవరూ చూడలేదని భావించింది. అయితే దశరథ మహా రాజు ఇదంతా చూశాడు. తన కోడలు సీతాదేవి తన సాధారణ మహిళ కాదని.. ప్రపంచానికే తల్లి అని, శక్తి స్వరూపిణి అని దాశరధ మహారాజు అర్థం చేసుకున్నాడు.

మామగారికి వాగ్దానం చేసిన సీతాదేవి

పాయసం తిన్న తర్వాత దశరథ మహారాజు తన గదిలోకి వెళ్ళాడు. ఆ తరువాత అతను తన కోడలైన సీతాదేవిని తన గదికి పిలిచి.. ఆమె చేసిన అద్భుతం గురించి తనకు తెలుసునని చెప్పాడు. దశరధుడు అమ్మా… ఈ రోజు నేను నీ అద్భుతమైన శక్తిని ప్రత్యక్షంగా చూశాను” అని అన్నాడు. మీ దృష్టిలో ఉన్న శక్తి అతీంద్రియమైనది. చాలా ప్రేమగా సీతదేవితో అమ్మా.. నువ్వు ఆ గడ్డిని చూసిన దృష్టితో పొరపాటున కూడా నీ శత్రువును ఎప్పుడూ చూడకు. మీ కళ్ళలో ఎల్లప్పుడూ కరుణ, ప్రేమని నిలుపుకోండి. మీ దృష్టి, మీ శక్తి రక్షణ, సంక్షేమం కోసమే ఉపయోగించాలి, విధ్వంసం కోసం కాదని చెప్పాడు దాశరధ మహారాజు. ఈ కారణంగానే సీతదేవి రావణుడిని దహనం చేయలేదు.. శ్రీరాముడి కోసం వేచి ఉంది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.