Shobha Yatra:108 కలశాలతో 500 మంది శ్రీరామ శోభాయాత్ర.. రామ నామ స్మరణతో నిండిపోయిన శైవ క్షేత్రం

| Edited By: Surya Kala

Jan 23, 2024 | 8:43 AM

నంద్యాల జిల్లా అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్టపన సందర్భంగా శ్రీశైలం క్షేత్రంలో స్థానికులచే శ్రీ రామ శోభాయాత్ర ఘనంగా జరిగింది. 108 కలశాలతో ముత్తైదువులు స్థానికులు సుమారు ఐదువందల మంది స్థానికులతో శ్రీరామ శోభాయాత్ర సాగింది. ముందుగా క్షేత్ర పాలకులు బయలు వీరభద్రస్వామి ఆలయం వద్ద మహిళలు కళాశాలు నెత్తిన పెట్టుకొని  శోభాయాత్రను  ప్రారంభించారు.

Shobha Yatra:108 కలశాలతో 500 మంది శ్రీరామ శోభాయాత్ర.. రామ నామ స్మరణతో నిండిపోయిన శైవ క్షేత్రం
Shobha Yatra In Sri Sailam
Follow us on

అయోధ్యలో బాల రాముడు గర్భ గుడిలో కొలువుదీరే శుభ సమయంలో యావత్ దేశంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా రామ భక్తులు సంబరాలను జరుపుకున్నారు. రామ నామ స్మరణతో మారుమ్రోగిపోయింది. నంద్యాల జిల్లా అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్టపన సందర్భంగా శ్రీశైలం క్షేత్రంలో స్థానికులచే శ్రీ రామ శోభాయాత్ర ఘనంగా జరిగింది. 108 కలశాలతో ముత్తైదువులు స్థానికులు సుమారు ఐదువందల మంది స్థానికులతో శ్రీరామ శోభాయాత్ర సాగింది. ముందుగా క్షేత్ర పాలకులు బయలు వీరభద్రస్వామి ఆలయం వద్ద మహిళలు కళాశాలు నెత్తిన పెట్టుకొని  శోభాయాత్రను  ప్రారంభించారు. అక్కడ నుంచి శ్రీ స్వామి అమ్మవారి ప్రధాన ఆలయం నుండి పాతాళగంగ మార్గంలోని శ్రీ  ఆంజనేయస్వామి ఆలయం వరకు కన్నులపండువగా కోలాహలంగా శోభాయాత్ర సాగింది.

ఈ శోభాయాత్రలో శ్రీరాముడు చిత్ర పటాన్ని చేతపట్టుకుని మేళతాళలతో చిన్న పెద్ద మహిళలతో సహా స్థానికులు శోభాయాత్రకు తరలివచ్చారు.  జైశ్రీరామ్ జైశ్రీరామ్ అంటూ నినదిస్తూ నృత్యాలు చేస్తూ ఆనందహేలితో శ్రీరామ శోభాయాత్ర చేశారు. మరోపక్క శనివారం నుంచే కాషాయ జెండాలతో క్షేత్రం మొత్తం కాషాయ మయమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..