Shiva Puja Tips: శివ పురాణం ప్రకారం శివయ్య పూజలో ఈ వస్తువులు నిషేధం.. ఎందుకంటే..

హిందూ మత విశ్వాసాల ప్రకారం శివుడు సులభంగా సంతోషించే దేవుడు. కేవలం జలంతో అభిషేకం చేసినా చాలు త్వరగా సంతోషిస్తాడు. అలాగే భక్తులు కోరుకున్న కోర్కెలను తీరుస్తాడు. శివుడికి ఏమి ఇష్టమో మనందరికీ తెలుసు.. వాటినే శివలింగానికి సమర్పిస్తాము. అయితే శివయ్య పూజలో కొన్ని వస్తువులను పొరపాటున కూడా చేర్చకూడని మీకు తెలుసా?

Shiva Puja Tips: శివ పురాణం ప్రకారం శివయ్య పూజలో ఈ వస్తువులు నిషేధం.. ఎందుకంటే..
Lord Shiva Puja

Updated on: Apr 21, 2025 | 2:29 PM

శివుడు భోలాశంకరుడు అనేది ఎంత నిజమో.. శివుడికి ఆగ్రహం కూడా చాలా త్వరగా వస్తుందనేది కూడా అంతే నిజం. శివుని తాండవం గురించి అందరికీ తెలిసిందే.. శివుడు త్వరగా ప్రసన్నుడవుతాడు.. త్వరగా కోపం కూడా తెచ్చుకుంటాడు. కనుక శివుడికి కోపం తెప్పించే ఏ పని చేయవద్దు అని పండితులు సూచిస్తూ ఉంటారు. ఈ రోజు మనం శివుని పూజకి కొన్ని వస్తువులను నిషేధించబడ్డాయి. ఆ వస్తువుల జాబితాను తెలుసుకుందాం.. వీటిని శివయ్యకు ఎప్పుడూ సమర్పించకూడదు. శివుని పూజలో నిషేధించబడినవిగా పరిగణించబడేవి ఏమిటంటే..

పసుపు: హిందూ మతంలో పసుపును శుభప్రదంగా భావిస్తారు. అయితే శివుడు పురుషత్వానికి చిహ్నం కనుక శివారాధనలో పసుపును ఉపయోగించరు. పసుపు పూజలో సమర్పించరు. ఏ కారణంగా కూడా మహాదేవుడికి పసుపును సమర్పించవద్దు.

కుంకుమ: కుంకుమ కూడా శివుడికి సమర్పించ వద్దు. శివ పూజలో కుంకుమ నిషేధం. పసుపు వలెనే కుంకుమ కూడా అదృష్టానికి, శుభానికి చిహ్నం. అయితే లయకారుడైన శివుడు త్యాగానికి చిహ్నంగా భావిస్తారు. కనుక పసుపు, కుంకుమ ఈ రెండు వస్తువులను శివుడికి సమర్పించకపోవడానికి కారణం ఇదే.

ఇవి కూడా చదవండి

సంపంగి, మొగలి పువ్వులు: శివుడికి , మందారం , కమలం తప్ప ఎరుపు రంగు పువ్వులు ఏవీ ఇష్టం ఉండవు. శివుడికి సంపంగి, మొగలి పువ్వులు సమర్పించడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం, మొగలి పువ్వు బ్రహ్మకు అబద్ధాలు చెప్పడంలో సహాయం చేసిందని.. అందుకే శివుడు మొగలి పువ్వుని శివుడు శపించాడని తెలుస్తోంది.

శంఖం: శివుడు శంఖచూడుడు అనే రాక్షసుడిని సంహరించినందున శివుని పూజలో శంఖాన్ని ఉపయోగించడం నిషేధం. ఈ కారణంగా, శివపూజలో శంఖం ఉండదు.. అలాగే శంఖంతో నీటిని శివుడికి సమర్పించరు.

కొబ్బరి నీళ్లు: శివుడికి కొబ్బరి నీళ్ళు సమర్పించవచ్చు. కానీ కొబ్బరి నీళ్ళతో శివలింగాన్ని పూజించకూడదు. భగవంతుడికి సమర్పించిన ప్రతిదాన్ని నిర్మలయంగా భావిస్తారు.యు భక్తులు దానిని తినడం నిషేధించబడింది. దేవతలకు నైవేద్యం పెట్టిన తర్వాత కొబ్బరి నీళ్ళు తాగడం తప్పనిసరి కనుక శివుడికి ఎప్పుడూ కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయకూడదు.

తులసి దళాలు: తులసి ఆకులను కూడా శివుడికి సమర్పించకూడదు. రాక్షస రాజు జలంధరుడి భార్య బృంద తులసి మొక్కగా అవతరించింది. జలంధరుడిని శివుడు సంహరించాడు కనుక బృంద స్వరూపం అయిన తులసి దళాలు శివుని పూజలో ఉపయోగించరాదు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు