Navaratri 2024: జీవితంలో సమస్యలా.. నవరాత్రుల్లో దుర్గా చాలీసా పఠించండి.. నియమాలు ఏమిటంటే

|

Sep 30, 2024 | 2:57 PM

నవరాత్రులలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను నవ దుర్గలుగా పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు, భక్తులు దుర్గా సప్తశతి, దుర్గా చాలీసాను కూడా పారాయణం చేస్తారు. మీరు కూడా ఈ నవరాత్రి సమయంలో దుర్గా చాలీసాను పఠించాలనుకుంటే,.. కొన్ని నియమాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. దుర్గా చాలీసా పఠించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు పురాణగ్రంథాలలో పేర్కొన్నాయి. ఈ నియమాలను పాటించడం ద్వారా పారాయణం చేయడం చాలా పవిత్రమైనది, ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది.

Navaratri 2024: జీవితంలో సమస్యలా.. నవరాత్రుల్లో దుర్గా చాలీసా పఠించండి.. నియమాలు ఏమిటంటే
Dasara 2024
Follow us on

దేవీ నవరాత్రులు ప్రారంభం కానుండడానికి ఇంకా రెండు రోజులే సమయం ఉంది. దేశవ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. నవరాత్రులలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను నవ దుర్గలుగా పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు, భక్తులు దుర్గా సప్తశతి, దుర్గా చాలీసాను కూడా పారాయణం చేస్తారు. మీరు కూడా ఈ నవరాత్రి సమయంలో దుర్గా చాలీసాను పఠించాలనుకుంటే,.. కొన్ని నియమాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. దుర్గా చాలీసా పఠించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు పురాణగ్రంథాలలో పేర్కొన్నాయి. ఈ నియమాలను పాటించడం ద్వారా పారాయణం చేయడం చాలా పవిత్రమైనది, ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది.

నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి?

పంచాంగం ప్రకారం ఈసారి శారదీయ నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ అర్ధరాత్రి 12.19 గంటలకు ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం ప్రతిపాద తిథి నుంచి ప్రారంభమై.. మర్నాడు అక్టోబర్ 4వ తేదీ తెల్లవారుజామున 2.58 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం శారదీయ నవరాత్రులు గురువారం అక్టోబర్ 3వ తేదీ 2024 నుండి ప్రారంభంకానున్నాయి. ఈ పండుగ అక్టోబర్ 12వ తేదీ, 2024 శనివారం ముగుస్తుంది.

దుర్గా చాలీసా చదవడానికి నియమాలు

దుర్గా చాలీసా పఠించడానికి సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. దీని తరువాత పీఠం మీద ఉన్న దుర్గాదేవి విగ్రహానికి పువ్వులు, కుంకుమ, పసుపు, దీపం, పాలు, ప్రసాదం సమర్పించండి. అనంతరం దుర్గా చాలీసా చదవడం ప్రారంభించండి. దుర్గా చాలీసా ముగిసిన తర్వాత అమ్మవారికి హారతి నిచ్చి ఆపై ప్రసాదం తీసుకోండి.

ఇవి కూడా చదవండి

దుర్గా చాలీసా పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు

  1. దుర్గా చాలీసా పఠించడం వల్ల మానసిక ప్రశాంతతతోపాటు మానసిక ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  2. దుర్గా చాలీసాను క్రమం తప్పకుండా చదవడం ద్వారా శత్రువులపై విజయం సాధిస్తారు. శత్రువుల ప్రభావం కూడా తగ్గుతుంది.
  3. ఈ చాలీసా పఠించడం వల్ల వ్యక్తికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తాడు.
  4. దుర్గా చాలీసా పఠించడం వల్ల జీవితంలో చెడు శక్తుల నుండి ఉపశమనం లభిస్తుంది, దుష్ట శక్తుల నుండి కుటుంబాన్ని కూడా కాపాడుతుంది.
  5. ప్రతిరోజూ దుర్గా చాలీసా పఠించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. జీవితంలో వచ్చే దుఃఖాలతో పోరాడే శక్తి లభిస్తుంది.
  6. దుర్గా చాలీసాను క్రమం తప్పకుండా పఠించడం ద్వారా ఒక వ్యక్తి తన కోల్పోయిన గౌరవాన్ని, ఆస్తిని తిరిగి పొందగలడని నమ్ముతారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి