Navaratri: ఇంద్రకీలాద్రిపై మధ్యాహ్నం నుంచి రాజేశ్వరి దేవిగా దుర్గమ్మ.. జ్ఞాన, క్రియా శక్తులను ప్రసాదించే తల్లి దర్శనం కోసం పోటెత్తిన భక్తులు

|

Oct 23, 2023 | 3:21 PM

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. రాజరాజేశ్వరీదేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. ‘అపరాజితాదేవి’ గా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా.. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుందీ తల్లి.

Navaratri: ఇంద్రకీలాద్రిపై మధ్యాహ్నం నుంచి రాజేశ్వరి దేవిగా దుర్గమ్మ.. జ్ఞాన, క్రియా శక్తులను ప్రసాదించే తల్లి దర్శనం కోసం పోటెత్తిన భక్తులు
Indrakeeladri Dasara
Follow us on

దేశ వ్యాప్తంగా జరుగుతునం దేవీ నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. దుర్గాదేవిని వివిధ రూపాల్లో అలంకరించి భక్తి శ్రద్దలతో నియమ నిష్టలతో తొమ్మిది రోజులుగా భక్తులు కొలుస్తున్నారు. ప్రముఖ క్షేత్రాల్లో కొలువైన అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది అమ్మవారి రూపాల్లో భక్తులకు దర్శనం ఇచ్చి కనువిందు కలిగించారు. కనకదుర్గాదేవి కొలువైన ప్రముఖ క్షేత్రం ఇంద్రకీలాద్రి లో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని 10 రూపాల్లో అలంకరించారు. శరన్నవరాత్రుల్లో చివరి రోజైన నేడు దుర్గాదేవి రెండు అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇచ్చింది. ఇంద్రకీలాద్రిపై ఈరోజు మధ్యాహ్నం సకల లోకాలకు ఆరాధ్యదేవత రాజరాజేశ్వరి దేవిగా దుర్గమ్మ దర్శనం ఇచ్చింది. ఇది దుర్గాదేవి చివరి అలంకారం.

పురాణాల ప్రకారం.. శ్రీ రాజరాజేశ్వరీ దేవి సమస్త విశ్వానికీ మహారాజ్ఞి. సృష్టి, స్థితి, లయకారులైన త్రిమూర్తులు.. సమస్త లోకానికి పాలకులు.. అయితే ఈ త్రిమూర్తులను పాలించే దేవత రాజ రాజేశ్వరిగా  పేర్కొన్నారు.

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. రాజరాజేశ్వరీదేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. ‘అపరాజితాదేవి’ గా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా.. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుందీ తల్లి. యోగమూర్తిగా.. మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి రాజేశ్వరి దేవి అధిష్టాన దేవత.

ఇవి కూడా చదవండి

తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని రోజుకో అవతారంలో అలంకరిస్తూ.. చెడుపై మంచి సాధించిన గుర్తుగా పదో రోజున విజయదశమి లేదా దసరాగా జరుపుకుంటాం.

రాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు ఎడమ చేతిలో చెరకుగడ , కుడి చేతితో భక్తులకు అభయాన్ని ఇస్తూ.. భక్తులను అనుగ్రహిస్తుంది. దుష్టులను, లోక కంటకులను శిక్షించడానికి అంకుశం, పాశం ధరించి దర్శనం ఇస్తుంది. ప్రశాంతమైన చిరునవ్వు , చల్లని చూపుతో భక్తులను అనుగ్రహిస్తుంది రాజేశ్వరి దేవి. . చెరకు రసం అత్మజ్ఞానాన్ని సూచిస్తుంది.

సమున్నతమైన దైవిక శక్తికి ఈమె ప్రతీక. తనను పూజించిన భక్తులు చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించే నేర్పుని ఇస్తుంది. రాజరాజేశ్వరి అవతారంలోని అమ్మవారిని పూజించడంతో పాటు.. లలితా సహస్రనామ పారాయణం చేసి అమ్మవారికి కుంకుమార్చన చేసి.. అమ్మవారికి ఇష్టమైన సేమ్యా పాయసం , కొబ్బరి పాయసం, కొబ్బరన్నం , పరమాన్నం నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా పంచి పెట్టాలి. ఇలా చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

పఠించాల్సిన శ్లోకం..

అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ , బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా , చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ” పఠించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.