
శరత్ పున్నమి పండుగకు హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు తన పూర్తి వైభవంతో భూమిపై అమృతాన్ని కురిపించే ఏకైక రాత్రి ఇదేనని నమ్ముతారు. అందుకే ఈ రాత్రి చంద్రుడు వెన్నెలలో ఖీర్ (బియ్యం పాయసం) పెట్టి.. మర్నాడు దానిని ప్రసాదంగా తీసుకోవడం ఆచారం. ఇది ఆరోగ్యం , శ్రేయస్సును తెస్తుంది. ఈ సంవత్సరం శరత్ పూర్ణిమను అక్టోబర్ 6 లేదా 7న జరుపుకోవాలనే విషయంపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపధ్యంలో శరత్ పున్నమి తేదీ, శుభ సమయం, పూజ పద్ధతి.. ఈ పండుగకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం..
శరత్ పూర్ణిమ 2025 తేదీ?
హిందూ క్యాలెండర్ ప్రకారం పౌర్ణమి తిథి అక్టోబర్ 6న మధ్యాహ్నం 12:23 గంటలకు ప్రారంభమై.. అక్టోబర్ 7న ఉదయం 9:16 గంటలకు ముగుస్తుంది. పౌర్ణమి తిథి అక్టోబర్ 6న ప్రారంభమై ఈ రోజు రాత్రి చంద్ర దర్శనం కనుక శరత్ పూర్ణిమ ఉపవాసం, పూజలు 2025 అక్టోబర్ 6 సోమవారం నాడు నిర్వహిస్తారు.
పదహారు దశల చంద్రుని ప్రాముఖ్యత..అమృత వర్షం
శరత్ పూర్ణిమను అత్యంత ముఖ్యమైన పౌర్ణమిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ రోజున చంద్రుడు తన 16 దశలతో నిండి ఉంటాడు. ఈ 16 దశలు మానవ జీవితంలోని మానసిక ప్రశాంతత, అందం, బలం, జ్ఞానం, ఆధ్యాత్మిక పురోగతి వంటి వివిధ అంశాలకు సంబంధించినవి.
పౌరాణిక నమ్మకం: శరత్ పూర్ణిమ రాత్రి శ్రీకృష్ణుడు గోపికలతో మహారాసలీలను ప్రదర్శించాడని నమ్ముతారు. ఈ రాత్రి సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి భూమిపై తిరుగుతూ ఎవరైతే ఉపవాసముండి తనని పూజిస్తారో వారికి అష్టఐశ్వర్యాలు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే దీనిని ‘కోజాగరి’ పూర్ణిమ అని కూడా పిలుస్తారు.
శాస్త్రీయ, ఆరోగ్య ప్రాముఖ్యత: జ్యోతిషశాస్త్రం..ఆయుర్వేదం ప్రకారం శరత్ పూర్ణిమ రాత్రి చంద్రుని కిరణాలు చాలా శక్తివంతమైనవి. ప్రత్యేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ చంద్రకాంతిలో పాలు లేదా బియ్యం పాయసం పెట్టి తర్వాత దీనిని తినడం “అమృతం”గా పరిగణించబడుతుంది. ఈ పాయసం తినడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందని.. అనారోగ్యం నుంచి ఉపశమనం పొందుతారని, సానుకూల శక్తిని అందిస్తుందని నమ్ముతారు.
శరత్ పూర్ణిమ పూజ: ఈ రోజున విష్ణువు, లక్ష్మీదేవి, చంద్రుడిని పూజించడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి. ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. ఇంటిని, పూజా స్థలాన్ని గంగా జలంతో శుద్ధి చేయాలి. ఇంటి ఆలయం లేదా ప్రార్థనా స్థలంలో ఒక వేదికను ఏర్పాటు చేయాలి. దానిపై ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరుచి.. విష్ణువు, లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్టించాలి. ధూపం, దీపం వెలిగించి దేవతకు పువ్వులు, పండ్లు, ధాన్యం, నైవేద్యం సమర్పించండి. లక్ష్మీ దేవికి కమలం పువ్వు, తెల్లటి మిఠాయిలు .. ఒక కన్ను కొబ్బరికాయను సమర్పించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
రాత్రి బియ్యం పాయసం తయారు చేసి.. దానిని మట్టి లేదా వెండి పాత్రలో నింపి.. చంద్రకాంతి పడే విధంగా ఉంచండి. రాత్రి లక్ష్మీదేవి , చంద్ర భగవానుడికి అంకితం చేయబడిన మంత్రాలను జపించండి. ఈ రోజు 108 సార్లు “ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ సిద్ధ లక్ష్మీయే నమః” అనే మంత్రాన్ని జపించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత.. చంద్ర కిరణాలు పడిన పాయసాన్ని దేవునికి సమర్పించి.. మొత్తం కుటుంబంతో కలిసి ప్రసాదంగా తినండి. ఈ రోజున పేదలకు ఆహారం, దుస్తులు , డబ్బు దానం చేయడం చాలా పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.