Shani Jayanti: ఈ ఏడాది శని జయంతి ఎప్పుడు? శని దోషం ఉన్నవారు ఏ విధమైన పరిహారాలు చేయడం శుభప్రదం అంటే..

హిందూ మతంలో పండగలు, పర్వదినాలకు ప్రత్యేక స్థానం ఉంది. అదే విధంగా సూర్యుడు, చాయల తనయుడు శనీశ్వరుడి జన్మదినోత్సవం హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. శనీశ్వరుడి న్యాయ దేవుడిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఆయన మనిషి చేసే మంచి, చెడుల ఆధారంగా కర్మ ఫలాలను అందిస్తాడు. కనుక శనిదేవుడిని పూజించడం వల్ల ఆయన వలన కలిగే దుష్ప్రభావాలు తగ్గడమే కాదు జీవితంలో స్థిరత్వం, శ్రేయస్సు లభిస్తుంది.

Shani Jayanti: ఈ ఏడాది శని జయంతి ఎప్పుడు? శని దోషం ఉన్నవారు ఏ విధమైన పరిహారాలు చేయడం శుభప్రదం అంటే..
Lord Shani Jayanti

Updated on: May 07, 2025 | 2:41 PM

హిందూ మతంలో దేవుళ్ళ జన్మదినోత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. అదే విధంగా కర్మ ఫలదాత శనిశ్వరుడి జయంతి కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని అమావాస్య తిథిని శని జయంతిగా జరుపుకుంటారు. ఈ రోజున కర్మ ఫలాలను ఇచ్చే శనిదేవుడిని పూజిస్తారు. అలాగే ఈ రోజున దానధర్మాలు చేయడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీనితో పాటు, శని దోషం, ఏలి నాటి శని సమస్యలతో ఇబ్బంది పడే వారు ఈ రోజు ప్రత్యేక పూజలను, పరిహరాలను చేయడం ద్వారా శనిశ్వరుడి అనుగ్రహంలో జీవితమలో కలిగే సమస్యలు, ఇబ్బందుల నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని నమ్మకం.

2025 లో శనీశ్వరుడి జయంతి ఎప్పుడు?

హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలోని అమావాస్య తిధి మే 26న మధ్యాహ్నం 12:11 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మరుసటి రోజు అంటే మే 27న రాత్రి 8:31 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో శనీశ్వరుడి జయంతిని మే 27వ తేదీ మంగళవారం జరుపుకోనున్నారు.

ఇవి కూడా చదవండి

శనీశ్వరుడి జయంతికి అనుగ్రహం కోసం చేయాల్సిన పరిహారాలు

శని జయంతి రోజున దానధర్మాలు చేయడం శుభప్రదమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున శనిదేవుడుకి ఇష్టమైన నల్ల నువ్వులు, మినపప్పు, నల్ల బట్టలు, ఇనుప వస్తువులు, ఉక్కు పాత్రలు, దుప్పట్లు మొదలైన వాటిని పేదలకు దానం చేయడం ద్వారా సంతోషిస్తాడు.

శని జయంతి రోజున హనుమంతుడి ఆలయానికి లేదా శనీశ్వరుడి ఆలయానికి వెళ్లి శని దేవుడిని పూజించండి. అలాగే ఇనుప లేదా ఉక్కు పాత్రలో ఆవ నూనె పోసి మీ ప్రతిరూపాన్ని చూడండి. తరువాత ఆ నూనెను ఎవరైనా పేదవారికి దానం చేయండి. ఇలా చేయడం ద్వారా శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.

శని జయంతి రోజున ఉదయం, సాయంత్రం ‘ఓం శనైశ్చరాయ నమః’ అని 108 సార్లు జపించండి. ఈ రోజున కుక్కలకు, కాకులకు , ఆవులకు , వికలాంగులకు , రోగులు మొదలైన వారికి ఆహారం పెట్టండి. ఇలా చేయడం వల్ల శనీశ్వరుడు సంతోషిస్తాడని.. ఈ పరిహారం చేసిన వ్యక్తి జీవితంలో ఎటువంటి కొరతా ఎదురుకాదని నమ్ముతారు.

శని మహా దశ నుంచి బయటపడటానికి శనీశ్వర జన్మదినోత్సవం రోజున చీమలకు నల్ల నువ్వులు, చక్కెర కలిపిన పిండిని ఆహారంగా అందించండి. ఈ పరిహారాన్ని ఏడు శనివారాలు చేయండి. అలాగే నల్ల మినపప్పు పిండితో చేసిన ఆహారాన్ని చేపలకు తినిపించండి. ఈ పరిహారం శని మహాదశ నుంచి ఉపశమనం కలిగిస్తుందని.. ఎవరి జాతకంలోనైనా శని గ్రహం స్థానం బలహీనంగా ఉంటే ఈ చర్యల వలన జాతకంలో శని స్థానం బలపడుతుందని నమ్మకం.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us