Shani Effects: మీ జాతకంలో శని స్థానం బలహీనంగా ఉందా?.. మరిచిపోయి కూడా ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే..!

|

Dec 11, 2021 | 9:29 AM

Shani Effects: జాతకంలో శని స్థానం బలహీనంగా ఉంటే, చేసే పని కూడా బలహీనంగానే ఉంటుంది. వ్యక్తి తన కష్టానికి తగిన ఫలాన్ని పొందలేడు. అటువంటి పరిస్థితిలో శని కర్మ ప్రదాత

Shani Effects: మీ జాతకంలో శని స్థానం బలహీనంగా ఉందా?.. మరిచిపోయి కూడా ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే..!
God Sani
Follow us on

Shani Effects: జాతకంలో శని స్థానం బలహీనంగా ఉంటే, చేసే పని కూడా బలహీనంగానే ఉంటుంది. వ్యక్తి తన కష్టానికి తగిన ఫలాన్ని పొందలేడు. అటువంటి పరిస్థితిలో శని కర్మ ప్రదాత అయినందున ఒక వ్యక్తి కొన్ని పనులు చేయకుండా ఉండాలి. క్షీణించిన కర్మ కారణంగా, శనికి సంబంధించిన పరిస్థితి మరింత దిగజారుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తారు. శనీశ్వరుడి కంటి చూపు చెడ్డదని చెబుతారు. శనీశ్వరుడి చెడు కన్ను ఒకరి జీవితంపై పడితే, అతని జీవితంలో ఏడుపు తప్ప మరేమీ ఉండదని విశ్వసిస్తారు. అందుకే శనిదేవుని దృష్టిలో పడకుండా ఉండేందుకు అందరూ ప్రయత్నిస్తారు. దీనికి జ్యోతిష్యంలో కూడా అనేక పరిహారాలు చెప్పబడ్డాయి.

మరోవైపు, జాతకంలో శని స్థానం బలహీనంగా ఉంటే చేస్తున్న పని కూడా క్షీణించడం ప్రారంభమవుతుంది. వ్యక్తి తన కష్టానికి పూర్తి ఫలాలను పొందలేడు. ఒకటి తర్వాత ఒకటిగా చెడు అలవాట్లకు బలైపోవడం మొదలవుతుంది. ఆర్థిక నష్టంతో పాటు పరువు, గౌరవం కూడా కోల్పోతారు. మొత్తానికి శని గ్రహ దృష్టి ప్రభావం మాదిరిగానే.. శని బలహీన స్థానమూ జీవితంపై చెడు ప్రభావం చూపుతుంది. శని దేవుడు కర్మలను ఇచ్చేవాడు కాబట్టి, అటువంటి పరిస్థితిలో ఒకరి పనులపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. ఈలోగా మీ కర్మ క్షీణిస్తే, పరిస్థితి మరింత దిగజారుతుంది.

శని బలహీనంగా ఉన్నప్పుడు మర్చిపోయి కూడా ఈ పని చేయొద్దు..
1. జాతకంలో శని బలహీనంగా ఉంటే.. నిస్సహాయులను, వృద్ధులను, స్త్రీలను అవమానించవద్దు. పేదవారిని హేళన చేయవద్దు. ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది.
2. పరిస్థితులు ఎలా ఉన్నా.. మాంసం, మద్యం, మాదకద్రవ్యాలు వినియోగానికి దూరంగా ఉండండి. లేకపోతే అది వ్యసనంగా మారుతుంది. మీ పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారడం ప్రారంభమవుతుంది.
3. ఎవరిపైనా ఎప్పుడూ తప్పుడు ఆరోపణలు చేయొద్దు. అంతే కాకుండా జూదం, వివాహేతర సంబంధాలు, దొంగతనం, నేరాలు మొదలైన వాటికి దూరంగా ఉండండి. వీటిల్లో చిక్కుకుంటే జీవితం నాశనం అవుతుంది.
4. శని బలహీనంగా ఉన్నందున శనివారం రోజు గోర్లు, వెంట్రుకలను కత్తిరించవద్దు. జంతువులు, పక్షులు, బలహీనమైన వ్యక్తులకు హానీ తలపెట్టవద్దు. అలా చేస్తే శనీశ్వరుడు ఏమాత్రం క్షమించడు. ఇంకా కఠినమైన పరీక్షలు పెడతాడు.

ఉపశమన చర్యలు..
1. ప్రతి శనివారం ప్రజలకు నీటిని అందించాలి. సాయంత్రం రావిచెట్టు కింద ఆవాల నూనెతో దీపం వెలిగించాలి. ఇది శనికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులను అయినా తొలగించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
2. నల్ల కుక్కకు ఆవనూనె తినిపించండి. రోటీపై ఆవనూనె వేసి దానిని తినిపించాలి. ఇలా రోజూ చేస్తే మంచి జరుగుతుంది. లేదంటే శనివారం అయినా ఇలా చేయండి.
3. పప్పు, నల్ల నువ్వులు, దుస్తులు, పాదరక్షలు, దుప్పట్లు మొదలైనవి పేదవారికి దానం చేయడానికి.
4. వ్యాపారంలో నష్టం ఉంటే.. శనివారం నాడు షాప్, ఆఫీసు గేటుపై గుర్రపుడెక్క ఉంచండి.
5. ప్రతీ శనివారం శని మంత్రం, శని చాలీసాను స్మరించాలి. మహాదేవునికి జలాభిషేకం చేయాలి.

Also read:

Nayanthara: మరో కొత్త వ్యాపారంలోకి లేడీ సూపర్‌ స్టార్‌.. బ్యూటీ బిజినెస్‌లో పెట్టుబడులు..

Semiconductor: సెమీకండక్టర్ అంటే ఏమిటి.. వాటి కొరత ఎందుకు వచ్చింది..?

Pushpa Item Song: యూట్యూబ్‎ను షేక్ చేస్తున్న సమంత ఐటెమ్ సాంగ్.. ఈ పాట పాడిన ఫోక్ సింగర్ ఎవరో తెలుసా..