
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో తాళపత్ర గ్రంథాలు (Palm Leaf Manuscripts) ఒక అద్భుతమైన జ్ఞాన భాండాగారం. వేల సంవత్సరాల క్రితం మహర్షులు తమ దివ్య దృష్టితో మానవ జీవితం, కర్మ, జన్మ రహస్యాలు, నక్షత్ర ప్రభావాలు, దేవతా శక్తుల సంబంధాన్ని తాళపత్రాలపై లిఖించారు. ఇవి కేవలం జ్యోతిష్య గ్రంథాలు మాత్రమే కాక, ఆత్మ వికాసానికి మార్గదర్శకాలు. ఈ తాళపత్రాల్లో ఒక ముఖ్యమైన అంశం.. ప్రతి నక్షత్రానికి ప్రత్యేకమైన దేవతా బలం ఉంటుంది. ఆ దేవత శక్తి మన స్వభావం, కర్మ, జీవిత మార్గాన్ని ప్రభావితం చేస్తుంది. వేద జ్యోతిష్యం ప్రకారం మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. ప్రతి నక్షత్రం ఒక ప్రత్యేక దేవతా తత్వానికి ప్రతీక. మన జన్మ నక్షత్రం ద్వారా మనపై ఏ దేవత ఆశీస్సులు ఉన్నాయో, ఏ శక్తిని ఆరాధించాలి అనేదీ తెలుస్తుంది.
తాళపత్ర గ్రంథాలు చెబుతున్న ముఖ్యమైన సూత్రం ఇదే.. నక్షత్రాధిపతి దేవతను ఉపాసించినవాడి కర్మ బంధనాలు శీఘ్రంగా సడలుతాయి.
అధిదేవతలు: అశ్విని కుమారులు
శక్తి: ఆరోగ్యం, వేగం, వైద్య శక్తి
మంత్రం: ఓం అశ్వినీ కుమారాభ్యాం నమః
అధిదేవత: యమధర్మరాజు
శక్తి: కర్మ ఫలాలు, ధైర్యం
మంత్రం: ఓం యమాయ నమః
అధిదేవత: అగ్ని దేవుడు
శక్తి: శుద్ధి, నాయకత్వం
మంత్రం: ఓం అగ్నయే నమః
అధిదేవత: బ్రహ్మ దేవుడు
శక్తి: సృష్టి, ఐశ్వర్యం
మంత్రం: ఓం బ్రహ్మణే నమః
అధిదేవత: సోమ దేవుడు (చంద్రుడు)
శక్తి: మనశ్శాంతి, అన్వేషణ
మంత్రం: ఓం సోమాయ నమః
అధిదేవత: రుద్రుడు (శివాంశ)
శక్తి: పరివర్తన, కర్మ శుద్ధి
మంత్రం: ఓం నమః శివాయ
అధిదేవతలు: ఆదిత్యులు
శక్తి: పునరుత్థానం, ఆశ
మంత్రం: ఓం ఆదిత్యాయ నమః
అధిదేవత: బృహస్పతి
శక్తి: జ్ఞానం, పోషణ
మంత్రం: ఓం గురవే నమః
అధిదేవతలు: నాగ దేవతలు
శక్తి: రహస్య శక్తులు, రక్షణ
మంత్రం: ఓం నాగాయ నమః
అధిదేవతలు: పితృ దేవతలు
శక్తి: వంశ పరంపర, రాజయోగం
మంత్రం: ఓం పితృభ్యో నమః
అధిదేవత: భగ దేవుడు
శక్తి: సౌఖ్యం, ప్రేమ
మంత్రం: ఓం భగాయ నమః
అధిదేవత: సూర్యుడు
శక్తి: ధర్మం, ఒప్పందాలు
మంత్రం: ఓం అరియమ్నే నమః
అధిదేవత: సవితృ దేవుడు
శక్తి: నైపుణ్యం, కార్యసాధన
మంత్రం: ఓం సవిత్రే నమః
అధిదేవత: త్వష్టా (విశ్వకర్మ)
శక్తి: సృజనాత్మకత, నిర్మాణం
మంత్రం: ఓం త్వష్ట్రే నమః
అధిదేవత: వాయు దేవుడు
శక్తి: స్వేచ్ఛ, వ్యాపారం
మంత్రం: ఓం వాయవే నమః
అధిదేవతలు: ఇంద్ర–అగ్ని
శక్తి: లక్ష్య సాధన, విజయం
మంత్రం: ఓం ఇంద్రాగ్నిభ్యాం నమః
అధిదేవత: మిత్ర దేవుడు
శక్తి: స్నేహం, భక్తి
మంత్రం: ఓం మిత్రాయ నమః
అధిదేవత: ఇంద్రుడు
శక్తి: అధికారం, రక్షణ
మంత్రం: ఓం ఇంద్రాయ నమః
అధిదేవత: నిరృతి దేవి
శక్తి: మూల శుద్ధి, విముక్తి
మంత్రం: ఓం నిరృత్యై నమః
అధిదేవత: ఆపః దేవతలు (జల తత్వం)
శక్తి: శుద్ధి, ధైర్యం
మంత్రం: ఓం ఆపః స్వాహా
అధిదేవత: విశ్వదేవతలు
శక్తి: శాశ్వత విజయం
మంత్రం: ఓం విశ్వదేవేభ్యో నమః
అధిదేవత: విష్ణువు
శక్తి: జ్ఞానం, ధర్మం
మంత్రం: ఓం నమో నారాయణాయ
అధిదేవతలు: అష్ట వసువులు
శక్తి: సంపద, సంగీతం
మంత్రం: ఓం వసుభ్యో నమః
అధిదేవత: వరుణుడు
శక్తి: వైద్యం, రహస్య జ్ఞానం
మంత్రం: ఓం వరుణాయ నమః
అధిదేవత: అజ ఏకపాద
శక్తి: తపస్సు, తీవ్రమైన సాధన
మంత్రం: ఓం అజఏకపాదాయ నమః
అధిదేవత: అహిర్బుధ్న్యుడు
శక్తి: స్థిరత్వం, ఆధ్యాత్మిక గంభీరత
మంత్రం: ఓం అహిర్బుధ్న్యాయ నమః
అధిదేవత: పూషణ్ దేవుడు
శక్తి: ప్రయాణ రక్షణ, సంపూర్ణత
మంత్రం: ఓం పూష్ణే నమః
మీ జన్మ నక్షత్రం రోజు మీ అధిదేవత జపం చేయడం ఉత్తమం. 108 సార్లు జపం చేయాలి. దీపం, దూపం లేదా అగరబత్తి వెలిగించి.. నిశ్చల మనస్సుతో నక్షత్ర దేవతను ఆరాధించండి. దీంతో గ్రహ దోషాలు స్వయంగా శాంతిస్తాయి. ఇక, మీ జీవితంలో ప్రతికూల శక్తులు అనుకూలంగా మారిపోయి సకల శుభాలను కలిగిస్తాయి.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)