Navratri 2023: అష్టమి లేదా నవమి రోజున కన్య పూజ ఎలా చేయాలి.. ప్రాముఖ్యత ఏమిటో తెలుసా

|

Oct 21, 2023 | 1:37 PM

నవరాత్రి అష్టమి లేదా నవమి తిథి నాడు చేసే కన్యాపూజ గురించి ఒక పౌరాణిక కథ ఉంది. ఒకసారి ఇంద్రుడు దుర్గా దేవిని ప్రసన్నం చేసుకోవడానికి సులభమయిన మార్గాన్ని బ్రహ్మదేవుడిని కోరగా.. బ్రహ్మ కన్యలను భక్తి,  విశ్వాసంతో పూజించమని చెప్పాడు. ఆడపిల్లలను పూజించే సంప్రదాయం ఇంద్రుడితో మొదలై.. నేటికీ కొనసాగుతోందని ప్రతీతి.

Navratri 2023: అష్టమి లేదా నవమి రోజున కన్య పూజ ఎలా చేయాలి.. ప్రాముఖ్యత ఏమిటో తెలుసా
Navaratri Kanya Puja
Follow us on

నవరాత్రుల్లో దుర్గాదేవిని తొమ్మిది రోజులు పూజిస్తారు.. పదోరోజున కన్య పూజను చేస్తారు. హిందూ విశ్వాసం ప్రకారం అమ్మాయిని పూజించకుండా దేవి నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన అసంపూర్ణంగా పరిగణింపడుతుంది. నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఉపవాసం చేసేవారు.. చేయని వారు కూడా తమ ఇళ్లలో 9 మంది ఆడపిల్లలను ఇంటికి పిలిచి పూజించి వారిని సాదరంగా గౌరవిస్తారు. ఇలా కన్య పూజను అష్టమి లేదా నవమి తిథి రోజున అమ్మ అనుగ్రహం పొందడానికి చేస్తారు. బాలికను పూజిస్తే దుర్గాదేవి తన భక్తుల పట్ల  ప్రసన్నమై.. నవరాత్రి పూజలు, ఉపవాసానికి సంబంధించిన పూర్తి ప్రయోజనాలను ప్రసాదిస్తుందని విశ్వాసం. దుర్గాదేవి స్వరూపంగా భావించే అమ్మాయిలను పూజించే విధానం, నియమాల గురించి వివరంగా తెలుసుకుందాం.

నవరాత్రులలో కన్యాపూజ ఎందుకు చేస్తారంటే..

నవరాత్రి అష్టమి లేదా నవమి తిథి నాడు చేసే కన్యాపూజ గురించి ఒక పౌరాణిక కథ ఉంది. ఒకసారి ఇంద్రుడు దుర్గా దేవిని ప్రసన్నం చేసుకోవడానికి సులభమయిన మార్గాన్ని బ్రహ్మదేవుడిని కోరగా.. బ్రహ్మ కన్యలను భక్తి,  విశ్వాసంతో పూజించమని చెప్పాడు. ఆడపిల్లలను పూజించే సంప్రదాయం ఇంద్రుడితో మొదలై.. నేటికీ కొనసాగుతోందని ప్రతీతి.

నవరాత్రుల్లో ఆడపిల్లల పూజకు ప్రాముఖ్యత

నవరాత్రి అష్టమి లేదా నవమి రోజున చేసే కన్య పూజలో బాలికల వయసు 11 ఏళ్ల లోపు ఉండాలి.  2 సంవత్సరాల బాలిక కుమారి, 3 సంవత్సరాల బాలిక ‘త్రిమూర్తి’, 4 సంవత్సరాల బాలిక ‘కళ్యాణి’, 5 సంవత్సరాల బాలిక ‘మా కలక’, 6 సంవత్సరాల బాలిక ‘చండిక’, 7 ఏళ్ళ అమ్మాయి ‘శాంభవి’ స్వరూపం, 8 ఏళ్ల అమ్మాయి ‘దేవి దుర్గ’, 9 ఏళ్ల అమ్మాయి ‘దేవి సుభద్ర’  10 ఏళ్ల అమ్మాయి ‘రోహిణి’ స్వరూపంగా భావించి పూజిస్తారు. ఎవరైతే కన్య పూజను భక్తి శ్రద్దలతో చేస్తారో ఆ సాధకుడిపై అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని.. ఏడాది పొడవునా సుఖ సంతోషాలతో జీవిస్తారని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

ఆడపిల్లలను పూజించే పద్ధతి

నవరాత్రి సమయంలో కన్య పూజ కోసం.. ఆహ్వానించిన బాలికలను ముందుగా ఇంటికి సాదర స్వాగతం చెప్పండి. గౌరవప్రదంగా ఇంట్లోకి ఆహ్వానించండి. ఇంట్లోకి ప్రవేశించగానే బాలికల పాదాలను నీటితో కడగండి. ఆపై బాలికలను పీఠం పై కూర్చోబెట్టండి. అనంతరం కాళ్లకు పసుపు, పారాణీ పెట్టండి.  అనంతరం బాలికలను దేవతలుగా భావించి కుంకుమ, చందనం, పువ్వులు మొదలైన వాటితో పూజించి.. ఆహారాన్ని అందించండి. బాలికలు ప్రసాదాన్ని ఆహారం తీసుకున్న తర్వాత.. మీ ఆర్ధిక శక్తిమేరకు బహుమతిని.. దక్షిణను ఇవ్వాలి.

బాలిక పూజలో చేయాల్సిన పరిహారం

బాలిక పూజ పూర్తి అయిన తర్వాత ప్రసాదాన్ని అందించి.. అప్పుడు మీరు ఆ బాలిక పాదాలకు నమస్కారం చేసి.. అక్షతలు వేయించుకుని ఆశీర్వాదం బాలిక నుంచి తీసుకోండి. తర్వాత ఆ కన్యలకు గౌరవప్రదంగా వీడ్కోలు పలకండి. ఈ పరిహారం చేసిన భక్తుడి ఇల్లు ఏడాది పొడవునా సంపదతో నిండి ఉంటుందని..  దుఃఖం, దురదృష్టం ఇంట్లోకి ప్రవేశించదని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.