Sankranti 2022: దక్షిణ భారత దేశంలో సంక్రాంతి పెద్ద పండగ.. ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారంటే..

| Edited By: Anil kumar poka

Jan 12, 2022 | 7:02 PM

Sankranti 2022: సంక్రాంతి దక్షిణ భారతదేశంలో జరుపుకునే ఒక ప్రసిద్ధ పండుగ. ఈ పండగను భోగి (bhogi), సంక్రాంతి (sankranti), కనుమ(kanuma)గా మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు...

Sankranti 2022: దక్షిణ భారత దేశంలో సంక్రాంతి పెద్ద పండగ.. ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారంటే..
Sankranti Festval
Follow us on

Sankranti 2022: సంక్రాంతి దక్షిణ భారతదేశంలో జరుపుకునే ఒక ప్రసిద్ధ పండుగ. ఈ పండగను భోగి (bhogi), సంక్రాంతి (sankranti), కనుమ(kanuma)గా మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది జనవరి 14 నుండి 17 వరకు మూడు రోజులు సంక్రాంతి వేడుకలను జరుపుకోనున్నారు. తమ చేతికి పంటలు వచ్చాయనే ఆనందంతో రైతులు జరుపుకునే పండగ సంక్రాంతి. దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ పండుగకు సంబంధించి ఒక ఆచారం ఉంది. ఈ ఆచారం ప్రకారం.. ప్రజలు తమ ఇళ్లలో పాత వస్తువులను తీసివేసి కొత్త వాటిని తీసుకువస్తారు. అంతేకాదు పేద ధనిక అనే తేడాలేదు.. ప్రతి ఒక్కరూ తమ శక్తీకి తగినట్లు కొత్త బట్టలను ధరిస్టారు. ఉత్తర భారతదేశంలో లోహ్రీ(Lohri) కి ఎంత ప్రత్యేకత ఉందో.. అదే విధంగా దక్షిణ భారతదేశంలో సంక్రాంతికి (pongal2022)కి అంతే ప్రాముఖ్యత ఉంది.

దక్షిణ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో వివిధ ఆచారాలతో సంక్రాంతిని జరుపుకుంటారు. ఈ పండగ సంతోషాన్ని ఇస్తుంది. ఈ పండుగకు 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని చెబుతారు.
సంక్రాంతి పండుగను ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడులో కూడా నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి , రెండవ రోజు సంక్రాంతి లేదా పొంగల్, మూడవ రోజు కనుక (మట్టు పొంగల్) నాల్గవ రోజు ముక్కనుమ ( కన్యా పొంగల్) గా ఘనంగా జరుపుకుంటారు. అయితే కొంతమంది సంక్రాంతి నుంచి తమకు కొత్త సంవత్సరం ప్రారంభమైంది అని కూడా అనుకుంటారు.
మొదటి రోజు భోగి.. ఈ రోజున తెల్లవారు జామునే భోగిమంటలను వేస్తారు. ఇంట్లో చిన్న పిలల్లు ఉంటె.. ఆ రోజు భోగి పళ్ళు కూడా పోస్తారు. రెండో రోజు సంక్రాంతి లేదా పెద్దల పండగ.. ఈరోజు తమ పుర్వికులను స్మరించుకుంటారు. కొంతమంది బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేస్తారు.
మూడవ రోజున శివునికి ఇష్టమైన నందిని పూజించడం ఆచారం. అందుకనే ఈ రోజు ఎద్దులను పూజిస్తారు. నాల్గవ రోజు అంటే చివరి రోజు ముక్కనుమ రోజున అమ్మవారిని పూజించి నైవేద్యం పెడతారు.
సంక్రాంతి అన్నదాతకు ఆనందం ఇచ్చే పండగ. వచ్చే పంటలు కూడా బాగుండాలని కోరుకుంటూ.. సూర్యభగవానుని పూజిస్తారు.

ఈ పండుగను దక్షిణ భారతదేశంలోని కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా , ఆంధ్రప్రదేశ్‌తో సహా ఇతర రాష్ట్రాల్లో సంక్రాంతి అని పిలుస్తారు. ఈ సంక్రాంతి పండగ రోజున సూర్య భగవానుడు ప్రత్యెక పూజలను అందుకుంటాడు.

Also Read:

భారత్‌లో కరోనా తాండవం.. తొలిసారిగా రెండు లక్షలకు చేరువలో రోజువారి కేసులు..