Sabarimala Temple: రేపు తులామాసం పూజల కోసం తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం.. ఆదివారం నుంచి భక్తులకు అనుమతి

|

Oct 15, 2021 | 6:04 PM

Sabarimala Ayyappa Temple: కరోనా నిబంధనల నడుమ శబరిమల అయ్యప్ప ఆలయం తులామాసం పూజలు కోసం రేపు సాయంత్రం 5 గంటలకు తెరవనున్నామని...

Sabarimala Temple: రేపు తులామాసం పూజల కోసం తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం.. ఆదివారం నుంచి భక్తులకు అనుమతి
Sabarimala Ayyappa Temple
Follow us on

Sabarimala Ayyappa Temple: కరోనా నిబంధనల నడుమ శబరిమల అయ్యప్ప ఆలయం తులామాసం పూజలు కోసం రేపు సాయంత్రం 5 గంటలకు తెరవనున్నామని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. ప్రారంభోత్సవం రోజున, ప్రస్తుత తంత్రీ కందరారు మహేష్ మోహనారు సమక్షంలో దీపాలు వెలిగిస్తారు. ప్రస్తుత మెయిషంటి వి.కె. జయరాజ్ పొట్టి ఆలయంలో దీపారాధన చేస్తారు. ఆలయానికి వెళ్లే దారిలో 16 వ మెట్టు దగ్గర అగ్నిహోమం చేస్తారు. రేపు సాయంత్రం ఆలయం తెరచినా.. ఆదివారం (అక్టోబర్ 17) ఉదయం 5 గంటల నుండి మాత్రమే భక్తులను శబరిమల ఆలయంలోకి   అనుమతి ఇస్తామని ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది.

అయ్యప్పను దర్శించుకోవాలంటే.. వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారానే వీలవుతుందని ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు గురువారం తెలియచేసింది.  ఆలయాన్ని దర్శించుకునే భక్తులు తప్పని సరిగా డబుల్ డోస్ టీకా సర్టిఫికేట్ లేదా RT-PCR నెగెటివ్ సర్టిఫికెట్‌ను సమర్పించాలి. అంతేకాదు అక్టోబర్ 17 న  దేవస్థానం అధ్యక్షుడు ఎన్ వాసు ఇతర అధికారుల సమక్షంలో, శబరిమల తదుపరి ప్రధాన పూజారిని ఎంపిక చేయడానికి, లాటరీని నిర్వహిస్తారు. నెలవారీ పూజలు పూర్తి అయిన తర్వాత తిరిగి అక్టోబర్ 21 న ఆలయాన్ని మూసివేస్తారు. అనంతరం నవంబర్ 2 న అత్త చితిర పూజ కోసం ఆలయం మళ్లీ తెరవబడుతుంది.. పూజను చేసిన మర్నాడే శబరిమల ఆలయం మూసివేయబడుతుంది.

Also Read: సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు.. శ్రీవారికి వైభవంగా చక్రస్నానం (photo gallery)