Puri Jagannath: పూరీ జగన్నాథ్ రథయాత్రకు వెళ్తున్నారా.. ఈ రెండు వస్తువులు తెచ్చుకోవడం మరచిపోకండి..

ఒడిశాలోని పూరీ జగన్నాథ క్షేత్రం హిందూ పుణ్యక్షేత్రాలలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. భక్తులు ఏడాది పొడవునా జగన్నాధుని దర్శనం కోసం ఆలయానికి వస్తూనే ఉంటారు. అయితే ఆషాఢ మాసంలో జరిగే జగన్నాథుని రథయాత్రలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా భక్తులు పూరీ క్షేత్రానికి చేరుకుంటారు. మీరు కూడా జగన్నాథుని రథయాత్రలో పాల్గొనేందుకు వెళ్ళాలనుకుంటున్నారా.. ఈ రెండు వస్తువులను తప్పని సరిగా తెచ్చుకోండి.

Puri Jagannath: పూరీ జగన్నాథ్ రథయాత్రకు వెళ్తున్నారా.. ఈ రెండు వస్తువులు తెచ్చుకోవడం మరచిపోకండి..
Puri Jagannath Radha Yatra

Updated on: Jun 13, 2025 | 7:14 AM

పూరీ జగన్నాథ క్షేత్రాన్ని వైకుంఠ క్షేత్రం అని పిలుస్తారు. ఇక్కడ వెలసిన దేవుడిని జగన్నాథుడు అంటే ప్రపంచానికి ప్రభువు అని పిలుస్తారు. జగన్నాథుడు శ్రీకృష్ణుని అవతారమని.. ఆయన హృదయం నేటికీ స్పందిస్తుందని భక్తుల నమ్మకం. శ్రీకృష్ణుడు తన సోదరి సుభద్ర, సోదరుడు బల రాముడితో కలిసి జగన్నాథ పురిలో ప్రతిష్టించబడ్డాడు. ఈ విగ్రహాలు చెక్కతో తయారు చేయబడ్డాయి.

జగన్నాథ ఆలయంపై భక్తుల విశ్వాసం అచంచలమైనది. ఆషాఢ మాసంలో జరిగే జగన్నాథ యాత్ర రథయాత్రలో పాల్గొనడానికి పూరీకి లక్షలాది మంది భక్తులు చేరుకుంటారు. మీరు కూడా జగన్నాథ రథయాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటే.. అక్కడి నుంచి రెండు వస్తువులను తీసుకుని తెచ్చుకోవడం మర్చిపోవద్దు.

జగన్నాథుని నిర్మాల్యం

ఒకటి జగన్నాథుని నిర్మాల్యం. జగన్నాథుని నిర్మాల్యం అనేది ఒక రకమైన పొడి బియ్యం. దీనిని కైబల్య అని కూడా అంటారు. ఈ బియ్యాన్ని ఎర్రటి వస్త్రంలో కట్టి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఏకాదశి రోజున జగన్నాథ ఆలయంలో బియ్యం నైవేద్యం పెడతారు .ఇక్కడ తీర్థయాత్ర చేసేవారు ఏకాదశి రోజున బియ్యం తినడ నిషేధం. భక్తులు జగన్నాథుని ఆశీర్వాదానికి చిహ్నంగా ఇంటికి ఈ బియాన్ని తీసుకువెళతారు. ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ బియ్యాన్ని ఇంటి స్టోర్ రూమ్‌లో ఉంచుతారు. ఇంట్లో ఏదైనా పండుగ లేదా కార్యక్రమం జరిగినప్పుడు..ఆహారంలో కొద్దిగా బియ్యం కలుపుతారు. ఇలా చేయడం ద్వారా ఆ సందర్భంలో ఎప్పుడూ ఆహార కొరత ఉండదని నమ్ముతారు. ఒక వ్యక్తి తన నిర్మాల్యాన్ని ఎవరికైనా మరణానికి ముందు దానం చేస్తే.. అతను మోక్షాన్ని పొందుతాడని కూడా నమ్ముతారు. అంతేకాదు కొన్నిసార్లు మరణిస్తున్న వారికి ఈ నిర్మాల్యం ఇస్తారు. ఇలా చేయడం వలన మరణించిన వారు స్వర్గానికి వెళ్తారని నమ్మకం.

ఇవి కూడా చదవండి

జగన్నాథుని కర్ర

జగన్నాథ రథయాత్ర తర్వాత భక్తులు ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు కర్ర. ఈ కర్ర ఇంట్లోని దుఃఖం, పేదరికాన్ని తొలగిస్తుందని నమ్ముతారు. దీన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల కీర్తి, తెలివితేటలు, దీర్ఘాయువు పెరుగుతాయి. ఇంట్లోని పూజా స్థలంలో దీన్ని ఉంచడం శుభప్రదం. ఇంట్లోని ప్రతి సభ్యుడిని ఈ కర్రతో కొట్టే సంప్రదాయం ఉంది. ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఆనందం, అదృష్టం ఎల్లప్పుడూ ఉంటుందని భక్తుల నమ్మకం.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.